Chorantians Bible Quiz
View Allవిడువలేనయా నీ పాదపద్మము
విడువలేనయా నీ పాదపద్మము మరువలేనయా నీ సన్నిధానము*2*
ఘనుడా నజరేతువాడ ప్రియుడా నా ప్రాణనాథ*2*
స్తుతి ఘనత మహిమ ప్రభావము నీకే*2*
1.గాతకాలమంత నీ నీడలోనె నన్ను దాచితివి
కలనైనా నేను ఊహించలేని కార్యాలు చేసితివి*2*
గర్భాన నను మోసిన తల్లి మరచెను,చేయి పట్టి నడిపిన నా తండ్రి విడచెను2
అన్ని వేళలా నీ కంటిపాపలా నన్ను దాచినావు యేసయ్యా*2* “విడువ”
2.ధరయందు నన్ను దీవించినావు నీ వాత్సల్యముతో
నా దోషమంత తొలగించినావు కడిగి నీ రుధిరములో*2*
ఏనాడు నే మరువను నీ మేలులు నిత్యము నే చాటెద నీ ఉపకార్యములు
(నా)బ్రతుకు కాలము నిను ప్రస్తుతించగ నన్ను పిలచినావు యేసయ్య 2