విడువను నిను ఎడబాయనని నా

144 Views

విడువను నిను ఎడబాయనని నా
కభయ మొసంగిన దేవా
నా కభయ మొసంగిన దేవా

నేరములెన్నో చేసి చేసి – దారి తప్పి తిరిగితినయ్యా (2)
నేరము బాపుము దేవా – నీ దారిని నడుపుము దేవా         ||విడువను||

పందులు మేపుచు ఆకలి బాధలో – పొట్టును కోరిన నీచుడనయ్యా (2)
నీ దరి చేరితినయ్యా నా తండ్రివి నీవెగదయ్యా          ||విడువను||

మహిమ వస్త్రము సమాధానపు జోడును నాకు తొడిగితివయ్యా (2)
గొప్పగు విందులో చేర్చి నీ కొమరునిగా చేసితివి        ||విడువను||

సుందరమైన విందులలో పరిశుద్దులతో కలిపితివయ్యా (2)
నిండుగా నా హృదయముతో దేవ వందనమర్పించెదను         ||విడువను||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account