వినుమా యేసుని జననము

250 Views

వినుమా యేసుని జననము
కనుమా కన్య గర్భమందున (2)
పరమ దేవుని లేఖనము (2)
నెరవేరే గైకొనుమా (2)
ఆనందం విరసిల్లె జనమంతా
సంతోషం కలిగెను మనకంతా
సౌభాగ్యం ప్రణవిల్లె ప్రభుచెంత
చిరజీవం దిగివచ్చె భువికంతా      ||వినుమా||

గొల్లలొచ్చె దూతద్వారా సాగిలపడి మ్రొక్కిరంట
చుక్కచూచి జ్ఞానులువచ్చిరి యేసును చూచి కానుకలిచ్చిరి
మనకోసం పుట్టెనంట పశువుల పాకలోన
ఎంత మస్తు దేవుడన్న రక్షణనే తెచ్చెనన్నా    ||వినుమా||

పాపులనంతా రక్షింపగా
పరమును విడిచె యేసు (2)
దీనులకంతా శుభవార్తేగా (2)
నడువంగ ప్రభువైపునకు (2)      ||ఆనందం||

అదిగో సర్వలోక రక్షకుడు
దివినుండి దిగివచ్చినాఁడురా (2)
చూడుము యేసుని దివ్యమోమును (2)
రుచియించు ప్రభుని ప్రేమను (2)      ||ఆనందం||

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account