యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి

106 Views

యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి
మాకు లేనిది లేదు లేమి కలుగదు (2)         ||యెహోవా||

వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను
ఆత్మ జలములో దప్పిక తీర్చెను (2)
మా ప్రాణములు సేదదీర్చేను
నీతి మార్గమున నడిపించెను         ||యెహోవా||

కారు చీకటిలో కన్నీరు తుడిచెను
మరణ పడకలో ఊపిరి పోసెను (2)
మా తోడు నీడై నిలిచి నడచెను
శత్రు పీఠమున విందు చేసెను         ||యెహోవా||

పరిశుద్ధాత్మలో ముంచి వేసెను
పరమానందము పొంగిపోయెను (2)
పరలోకములో గొరియపిల్లను
నిరతము మేము కీర్తింతుము         ||యెహోవా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account