యెహోవా నీదు మేలులను – ఎలా వర్ణింపగలను

222 Views

యెహోవా నీదు మేలులను – ఎలా వర్ణింపగలను
కీర్తింతును నీదు ప్రేమను – దేవా అది ఎంతో మధురం
దైవం నీవయ్యా పాపిని నేనయ్యా
నీదు రక్తముతో నన్ను కడుగు
జీవం నీవయ్యా జీవితం నీదయ్యా
నీదు సాక్షిగా నన్ను నిలుపు
కారణ భూతుడా పరిశుద్ధుడా
నీదు ఆత్మతో నన్ను నింపు
మరనాత యేసు నాథా
నీదు రాజ్యములో నన్ను చేర్చు

ఘనుడా సిల్వ ధరుడా
అమూల్యం నీదు రుధిరం (2) ఓ…
నిన్ను ఆరాధించే బ్రతుకు ధాన్యం
నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం
ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం
సర్వోన్నతుడా నీకే సర్వం          ||యెహోవా||

ప్రియుడా ప్రాణ ప్రియుడా
వరమే నీదు స్నేహం (2)
నా రక్షణకై పరమును వీడే
నా విమోచనకై క్రయ ధనమాయె
ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం
పరమాత్ముడా నీకే సర్వం         ||యెహోవా||

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account