ఏమని స్తుయింతును

8 Views

పల్లవి -:
ఏమని స్తుయింతును ఏమని
పొగడనూ – నా యేసు నీ
కృపను నే – మరువ జాలను
(2)
నీ కృపయే నా బలము – నీ కృపయే విజయము (2)

1.పనికిరాని నను నీవు పైకి
లేవ నెత్తితివి – నీదు పాత్రగా
మార్చి నన్ను వాడుకొంటివి
(2)మహిమ గలిగిన
ప్రత్యక్షతలో నీదు
కృపలతో నింపితివి(2)
(నీ కృపయే నా)
2.ఇరుకునందు నీకు – నేను
ప్రార్థన చేయగా – విశాల
స్థలమందు నాకు – నీవు
దర్శనమిచ్చితివి (2)
విలువగలిగిన – మర్మములు
నాకు తెలీయ జేసితివి(2)
( నీ కృపయే )
3.సాతానును ఓడించుటకు
నాకు బలమును ఇచ్చితివి
నీదు ఆత్మతో – నింపి నన్ను
అభిషేకించితివి (2)
నీదు ద్వజమును
పైకెత్తుటకు – నన్ను నీకై
నిలిపితివి(2)
(నీ కృపయే నా)

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account