యేసయ్యా.. నీకే వందనం

318 Views

భూమ్యాకాశములను సృజియించిన దేవా
నీ సన్నిధిలోనే ప్రవేశించెదను
నీ పరిశుద్ధతను ప్రకాశించుటకు
నీ పరిపూర్ణతలో నన్ను నడిపించుము
మహిమా నీకే… ఘనతా నీకే…
ప్రతి దినం నా ఆరాధన నీకే
మహిమా నీకే… ఘనతా నీకే…
నిరంతరం ఈ స్తోత్రార్పణ నీకే
యేసయ్యా.. నీకే వందనం – (4)

మట్టి ముద్దనైన నన్ను మనిషిగా రూపించావు
వట్టి వాడనైన గాని మహిమతో నను నింపావు (2)
నీ కౌగిలిలో నను హత్తుకొని
అర చేతులలో నను చెక్కుకొని
నీ సన్నిధి కాంతిని నాపైనే ఉదయింపజేసావు (2)
ఏమివ్వగలను నేను నీ ప్రేమకై
పగిలిన హృదయముతో ఆరాధింతును         ||మహిమా||

ఘోర పాపినైన నన్ను ఎంతగా ప్రేమించావు
సిలువ పైన ప్రాణమిచ్చి వింతగా నను మార్చావు (2)
నా మనో నేత్రమును వెలిగించి
నా హృదయ కాఠిన్యమును మార్చి
అర్హతే లేని బలహీనుడనే ఎన్నుకున్నావు (2)
ఏమిచ్చి నీ ఋణమును నే తీర్తును
విరిగి నలిగిన మనస్సుతో ఆరాధింతును         ||మహిమా||

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account