యేసు నాథా దేవా

107 Views

యేసు నాథా దేవా
వందనాలు రాజా.. వందనాలు
రాజాధి రాజా నీకే వందనాలు
రవి కోటి తేజా నీకే వందనాలు (2)      ||యేసు నాథా||

పాపిని కరుణించి ప్రాణ దానమిచ్చావు
పరమ జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి (2)
పన్నెండు గుమ్మముల…
పట్టణమే నాకు కట్టిపెట్టినావా      ||రాజాధి రాజా||

నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు
నీ నీతి నాకిచ్చి నిత్య రాజ్యమిచ్చావు (2)
నీ నీతి నీ రాజ్యం…
నిండైన నా భాగ్యమే      ||రాజాధి రాజా||

హీనుని దీవించి ఘనునిగా చేసావు
నీ రుధిరమే కార్చి నా ఋణము దీర్చావు (2)
నా సల్లనయ్యా…
నా యన్న నీవే నా యేసయ్యా      ||రాజాధి రాజా||

కన్ను మిన్ను గానకుండా నిన్ను మీరిపోయాను
చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు (2)
నీ మనసే వెన్నయ్యా…
నా కన్న తండ్రి నా యేసయ్యా      ||రాజాధి రాజా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account