యేసు రాజు రాజుల రాజై

Hosanna Ministries
545 Views

యేసు రాజు రాజుల రాజై
త్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండె
హోసన్నా జయమే – హోసన్నా జయమే
హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే ॥యేసు॥

యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2)
భయము లేదు జయము మనదే (2)
విజయ గీతము పాడెదము (2) ॥హోసన్నా॥

శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధియైనా (2)
యేసు గాయముల్ స్వస్థపరచున్ (2)
రక్తమే రక్షణ నిచ్చున్ (2) ॥హోసన్నా॥

హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ (2)
యేసు రాజు మనకు ప్రభువై (2)
త్వరగా వచ్చుచుండె (2) ॥హోసన్నా॥

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account