యోగ్యుడ పరిశుద్ధుడ
ప: యోగ్యుడ పరిశుద్ధుడ
(నీ)మహిమలో నున్న శుద్ధులే నీకు ॥2॥
సాగిలపడి ఆరాధన చేయ-నిను నేనే
రీతిగ ఆరాధింతును ॥2॥
ఆరాధన….. ఆరాధన…..||2||
చ: ఎరిగి ఎరిగి నే చేసిన పాపములు నీ
పావన కాయమును గాయ పరచగా ॥2॥
ఆ గాయాలతోనే స్వస్థతనొసగి-ఆ
గాయాలతోనే స్వస్థతనొసగి
బ్రతికించిన నీకే అర్పణనవుదును
నను బ్రతికించిన నీకే అర్పణనవుదును
ఆరాధన….. ఆరాధన…..||2||
చ: నా గతమెరిగి నీ సేవకు పిలువ
బ్రతికించిన నీకే నా బ్రతుకునివ్వక ॥2॥
విసిగించిన నన్ను నీ సేవలో నిలిపి
విసిగించిన నన్ను నీ సేవలో నిలిపి
శాశ్వత ప్రేమకే బానిసవుదును నీ
శాశ్వత ప్రేమకే బానిసవుదును
ఆరాధన…… ఆరాధన……||2||
చ: ఏ మంచి లేని అయోగ్యుడ నన్ను
నమ్మకస్థునిగా ఎంచిన ప్రేమచే || 2 ||
నమ్మకమైన నా దాసుడు.. అనే
సాక్షము పొంది ధన్యుడవ్వుదును నే
ఆరాధన…..ఆరాధన……||2||
॥యోగ్యుడా పరిశుద్ధుడ ॥