మదర్ థెరీస్సా సేవాజీవితము

పూర్తిపేరు:- ఆగ్నేస్ గోంక్సా బొజాక్సిమ్
(థెరీస్సా మార్టిన్) “మదర్ తెరిస్సా”
తల్లిదండ్రులు:- నికోలస్ దంపతులు
జన్మస్థలం:- యుగోస్లేవియాలోని సోఫే నగరము
జననము:- ఆగస్టు 26 1910
మరణం:- 1997
రక్షణానుభవం:- 21 సంవత్సరాల వయసులో

సేవాఫలితము:- తన స్వదేశాన్ని విడిచి భారత దేశంలో అడుగుపెట్టి ధీనులైన నిర్భాగ్యులుకు, పేదవారికి, కుష్టు రోగులకు, తన జీవితాన్ని అంకితం చేసి వారి కొరకు అనేక ఆశ్రమాలు, పాఠశాలలు, వైద్యశాలలు స్థాపించింది..

సేవలో ఎదుర్కొన్న కష్టాలు:-

బాల్యము నుండి నన్ గా మారి దీనులకు సేవ చేయాలనే సంకల్పం ఉన్నా ఆగ్నెస్ 1929లో “ఫోడాలిటి వర్జిన్ మేరీ” అనే సంస్థలో నన్ గా మారింది…ఇండియాకు వచ్చే ముందు డబ్లిన్ లో ఇంగ్లీష్ నేర్చుకుంది.. 1929 జనవరి 16న కలకత్తాలో దిగిన ఆగ్నెస్ కు అంతా కొత్తగా, వింతగా కనిపించింది. 1931 మార్చి 24న సిస్టర్ గా తన జీవితాన్ని అంకితం చేసుకుని ఫ్రెంచ్ సిస్టర్ థెరిసా మార్టిన్ పేరును ధరించి థెరిసా గా మారింది.. ఆ సమయంలో స్కూల్ టీచర్ గా, ప్రిన్సిపాల్ గా సేవ చేసింది.. కలకత్తాలోని మురికివాడలు, దారిద్ర్యము, జన విస్ఫోటనం చూసి వారికి సేవ చేయాలనే ఆకాంక్ష మరింతగా పెరిగింది.. 1946 సెప్టెంబర్ 10 తన జీవితంలో దైవ స్వరాన్ని విన్నది .. రైలులో డార్జిలింగ్ ప్రయాణం చేస్తున్నప్పుడు “దీనులకు నీ జీవితాన్ని అంకితం చెయ్యి” అనే స్వరం విని దైవాజ్ఞగా భావించి ఫాదర్ హెన్రీ ప్రోత్సాహం ద్వారా మురికివాడలలో అడుగుపెట్టింది. ఆ సమయములో తన దగ్గర మూడు చీరలు, ఐదు రూపాయలు మాత్రమే ఉన్నాయి..* కాని దేవుని మీద విశ్వాసంతో తన సేవను ప్రారంభించింది.. ‘లిటిల్ సిస్టర్ ఆఫ్ ద పూర్’ అనే సంస్థ వారి సహాయంతో ఓ పాఠశాల మరియు ఆసుపత్రి పని ప్రారంభించింది.. సహాయం కోసం దేవునికి మాత్రమే మొరపెట్టేది 1950లో ఆమె “మిషనరీస్ ఆఫ్ చారిటీ” అనే సంస్థ మొదలుపెట్టి దాని కొరకే జీవించి, మరణించాలి అని అనుకుంది.. దానిలో ప్రత్యేకంగా కుష్టురోగుల పునరావాస కేంద్రము ప్రారంభించింది..

1955లో మరణావస్థలో ఉన్న దీనుల కోసం “నిర్మల్ హృదయ్” స్థాపించింది, తల్లిదండ్రులు లేని అభాగ్యుల కొరకు “శిశు భవన్” లాంటి సంస్థలు విస్తరించాయి .తరువాత ఆమె దేశంలో శిశు సంరక్షణా కేంద్రాలు, స్కూల్లు, కాలేజీలు, ఆల్కహాల్ రిహబిలెషన్ సెంటర్లు, అనాదల కొరకు నైట్ షెల్టర్ లు, కుటుంబ నియంత్రణ కేంద్రాలు, మతిస్థిమితం లేని వారి కొరకు పునరావాస కేంద్రాలు, ఎయిడ్స్ బాధిత శరణాలయాలు……. ఇలా బాధలో ఉన్న వారిని ఆదుకునే ఎన్నో సంస్థలు ఆమె ఏర్పాటు చేసింది …ఆమె యొక్క సేవలు అనేక దేశాలకు విస్తరించాయి. 1988లో ఆర్మేనియా భూకంప సమయంలో మదర్ థెరీసా సేవలకు ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇథియోపియాలో వచ్చిన కరువులో అమెరికా ప్రెసిడెంట్ కు లేఖ వ్రాసి వెంటనే తాను సహాయము అందించింది .. గల్ఫ్ దేశాల్లో యుద్ధాలు జరిగి అనేక క్షతగాత్రుల కొరకు ఆమె వైద్య కేంద్రాలు స్థాపించి గొప్ప సేవ చేసింది…ఏకాకితనం అనేది మానవాళిని పీడిస్తున్న సమస్య.

అయితే ఎలాంటి వారైనా చనిపోయే సమయంలో ప్రశాంతంగా చనిపోవాలని దిక్కులేని వారిని, ఒంటరిగా ఉన్న వారిని అక్కున చేర్చుకుని వారి పెదాలపై నవ్వు పూయించేది..నిర్మలమైన ముఖము, ముఖిలించిన చేతులు, మూతపడ్డ కళ్ళు, ప్రార్ధించే అమ్మ, మదర్ పేరు ఎత్తితే ఎవరికైనా థెరిసాయే గుర్తుకు వస్తుంది.. ఎక్కడైనా దీన జనుల కేకలు వినిపిస్తే అక్కడ వాలిపోయేలా ఆ సంస్థలో పని చేస్తున్న సేవకులను తయారు చేసింది.. మదర్ థెరిసా చనిపోయేనాటికి 120 దేశాల్లో 500 అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి, 125 స్కూళ్లలో 2500 మంది పిల్లలు పోషించబడుతున్నారు, లక్షకుపైగా కుష్టు రోగులు, 1800కు పైగా క్షతగాత్రులకు సేవలందిస్తున్నారు.. జాతి, కుల, మత భేదం లేకుండా దీనబంధంగా తన హస్తాన్ని జాపింది.. మదర్ థెరీసా యొక్క సేవలకు మెచ్చి ప్రపంచ దేశాలు ఎన్నో అవార్డులు,పురస్కారాలు,డాక్టరేట్లు ఇచ్చి ఆమెను సత్కరించాయి.. తాను 60 సంవత్సరాలు సేవ చేసి 1997 లో మరణించింది…

గొప్ప పలుకు:- ” ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న, కుష్టురోగి గాయాలు కడిగితే ఏసుక్రీస్తు గాయాలను ముట్టినట్లు అయింది” అని పలికెను..

(కీర్తనలు 41:1) బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యేసుప్రభువు జీవిత అనుభవాలలో నెరవేరిన గొప్ప మాట ఎందుకంటే పేదలకు దేవుని హృదయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఈ భూమి మీదకు వచ్చి దిక్కులేని వారికి సహాయకునిగా తనదైన శైలిలో ప్రేమను పంచాడు అలాగె మన హృదయంలో కూడా ఆ విధంగానే బీదలైనవారికి చోటు ఉండాలి.. అందుకే మాతృమూర్తి మథర్ తెరిస్సా బీదలకు, దరిద్రులకు, ఎందరో అభాగ్యులైన స్త్రీలకు తల్లిగా ప్రేమను పంచి,
ఒక క్రైస్తవురాలైన స్త్రీ మిషనరీగా చేసిన ఈ సమాజిక సేవ ప్రతి క్రైస్తవునికి, దైవ జనులకు, మిషనరీ లకు ఆదర్శ ప్రాయమైనది….

1054 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account