అదోనిరామ్ జడ్సన్ సేవాజీవితము
పూర్తిపేరు:- అదోనిరామ్ జడ్సన్
తండ్రి పేరు:- సీనియర్ అదోనిరామ్ జడ్సన్
తల్లి పేరు:- అబీగయీలు
జన్మస్థలం:- అమెరికాలోని మసాచ్ సెట్స్ లోని మాలెన్.
భార్య పేరు:- ఆన్ హెజల్ టైన్
జననం:- 1788 ఆగస్టు 9
మరణం:- 1850 ఏప్రిల్ 12
సేవా ఫలితం:- అనేక బాధలు, శ్రమలు, పోరాటాలు మధ్య బర్మా దేశంలో సువార్త ప్రకటించాడు. బర్మా భాషలో బైబిల్ ను తర్జుమా చేసి చివరకు అక్కడే చనిపోయాడు. ఆయనకు సమాధి కూడా లేదు. అక్కడే జలసమాధి అయిపోయాడు..
సేవలో ఎదుర్కొన్న కష్టాలు:-
మిషనరీగా సువార్త అందని దేశాలకు వెళ్లి ఆత్మలు సంపాదించాలని ఆశపడ్డాడు..అలా 1813 జూలై 13న బర్మా కు చేరెను….
బర్మా దేశంలోని వారు క్రీస్తు సువార్త ప్రకటించేవారిని చూసి పిచ్చివారని అనుకుని సుత్తులతో కొట్టి రంగూన్ అనే ప్రాంతానికి తరలించేవారు…ఆ సమయంలో ప్రభువుపై భారం వేసి రంగూన్ పట్టణంలో ప్రవేశించెను. బహు మురికిగా బురదలో దుర్వాసనతో ఉన్న పట్టణంలో వింతైన ఆచారాలతో, పద్దతులతో నిండిన ఆ ప్రజల మధ్య బర్మా భాషను నేర్చుకుని ఆ ప్రజలకు సువార్తను అందించాడు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆ దేశ బుద్ధులను క్రీస్తు కొరకు సంపాదించుటకు నిశ్చయించుకొన్నాడు..తన యొక్క ప్రయాస ఫలితంగా ఆరు సంవత్సరాల తర్వాత మాన్ సన్ అనే వ్యక్తి క్రీస్తును అంగీకరించెను..సువార్త సేవ అభివృద్ధి పొందుతున్న దినములలో భౌద్ధమతము తప్ప ఇంకా ఏ ఇతర మతాలు అభివృద్ధి చెందడానికి వీలు లేదు అనే చట్టాన్ని దేశాన్ని పరిపాలిస్తున్న రాజు తీసుకుని వచ్చాడు. రాజు యొక్క ఆజ్ఞకు భయపడక దేవుడు ఆయనకు ఇచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని బలమును పొందాడు…ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా దేవునిలో బలముగా ముందుకు సాగెను….ఆ తరువాత ఓర్పుతో 16 సంవత్సరాలు సువార్త ప్రకటించి వందమందికి బాప్తిస్మమిచ్చెను…ఆ దేశ భాష లోనికి బైబిల్ తర్జుమా చేసి ఇంగ్లీష్ లోనే డిక్షనరీ కూడా రాసారు.
ఆ సమయంలో ఎనిమిది నెలల తన కుమారుడు చనిపోయాడు..బ్రిటిష్ వారు బర్మాను ముట్టడించినపుడు జడ్సన్ వారికి ఏదో రహస్యం అందిస్తున్నాడని నిందమోపి తనను 20 నెలలు జైలులో ఉంచారు.. ఆ సమయంలో తన భార్య క్రొత్తనిబంధన ప్రతులను బర్మా భాషలోనికి తర్జుమా చేసి జైలులో ఉన్న తన భర్తకు చూపించటానికి బైబిల్ ప్రతులను, తన కుమార్తెను తీసుకుని వచ్చింది.. ఇరవై నెలలు గడిచిన తర్వాత జైలు నుంచి ఇంటికి వచ్చిన జడ్సన్ భార్య, తన కుమార్తె చనిపోవడం చూసి కుంగిపోయాడు…చివరికి 33 సంవత్సరాల తరువాత జడ్సన్ క్షయవ్యాధికి గురై ఆరోగ్యం కోసం సముద్ర ప్రయాణం ప్రారంభించెను..చివరకు ఆ ప్రయాణంలోనే 1850 సంవత్సరంలో పడవలో మరణించాడు.. పడవ నావికుడు చనిపోయాడు అని గుర్తించి అతని తీసి సముద్రంలో పడవేశారు అలా జలసమాధి అయ్యాడు. 62 వ యేట 1850 ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 4:10 నిమిషాలకు మరణించెను.. 30 సంవత్సరాల సేవలో 63 సంఘాల్లో 7000 మంది సభ్యులు కలిగి ఇప్పుడు 163 మంది మిషనరీలు పనిచేస్తున్నారు
గొప్ప పలుకు:- * ”సిలువను స్థిరంగా స్థాపించే వరకూ ఇక్కడ నుండి కదలను” అని పలికాడు..*
మరి నీ స్థితి ఏమిటి నువ్వు చేసే పనిలో నువ్వు స్థిరంగా ఉన్నవా? ప్రభువు నీకు అప్పగించిన పనిలో స్థిరంగా ఉన్నవా? జడ్సన్ కి దేవుడు అప్పగించిన పనిలో స్థిరుడై దేవుని కొరకు గొప్పకార్యాలు చేసాడు.
( 1పేతురు 5:10) తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడినపిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బలపరచును. లోకంలో శ్రమలు వస్తాయి. వాటిని ఎదురించి ప్రభువులో నిలబడగలిగితే ప్రభువు మన ద్వారా గొప్పకార్యములు చేసి మనలను ఆయనలో స్థిరపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక ఆమెన్..