బిల్లీ గ్రాహం జీవిత చరిత్ర

పూర్తి పేరు:- జూనియర్ విలియం ఫ్రాంక్లిన్ గ్రాహం జన్మస్థలం:- అమెరికా దేశంలోని కరోలినా రాష్ట్రంలోని చార్లెట్ అనే పట్టణము
భార్య పేరు:- రూత్ బెల్
జననం:- 1918 నవంబర్ 07
మరణం:- 2018 ఫిబ్రవరి 21
రక్షణానుభవము:- 16 సంవత్సరాల వయసులో
సేవాఫలితము:- ప్రపంచంలోని అనేక దేశాలలో సువార్తసభల ద్వారా, రేడియో ప్రసంగాల ద్వారా, పత్రికలు, మ్యాగజైన్లు ద్వారా కొన్ని కోట్ల మందికి సువార్త ప్రకటించారు..

వ్యక్తిగత సాక్ష్యం:- డాక్టర్ బిల్లీ గ్రహం 1918 వ సంవత్సరంలో నవంబర్ 7వ తేదీన అమెరికాలోని కరోలినా రాష్ట్రంలో చార్లెట్ అనే పట్టణంలో ఫ్రాంక్లిన్ గ్రాహం, మారో అను దంపతులకు జన్మించాడు.. వీళ్లకు 200 ఎకరాలలో పారము కలిగి ఉన్నారు.. అలాగే వీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు.. చిన్నతనము నుండి గ్రాహం వుండేవాడు… పనులలో చురుకుగా పాల్గొనేవాడు.. చిన్నప్పటి నుంచి బైబిల్ చదవడం, ప్రార్థించటం, సండేస్కూల్ కు వెళ్ళడం తల్లిదండ్రులు అలవాటు చేశారు.. పుస్తకములు ఎక్కువగా చదివేవాడు.. నీగ్రో వాళ్లతో స్నేహం చేసేవాడు కానీ ఎటువంటి చెడు అలవాట్లు లేవు.. బేస్ బాల్ ఆటలో ప్రావీణ్యం కలిగినవాడు తల్లిదండ్రులు గ్రాహం బాధ్యతగల దేవుని పరిచారకుడుగా ఉండాలని ప్రార్థించేవారు..గ్రాహం గారి తండ్రి ఒక పెద్ద ప్రమాదం నుండి రక్షించబడిన తర్వాత మరింత దేవునికి దగ్గరయ్యారు, దేవునితో ఎక్కువ సమయం గడిపేవారు.

1934లో వారు ఉంటున్న పట్టణంలోనే ”మొర్థెకై హాం” అనే ప్రసంగీకుడు పదకొండు రోజులు ప్రార్థనలు నిర్వహించారు.. స్నేహితులతో కలిసి ఆ మీటింగ్ కి వెళ్ళినప్పుడు ప్రసంగానికి గ్రాహం ఆకర్షితుడయ్యాడు.. ఆ ప్రసంగీకులు యొక్క వాక్యాల ద్వారా బలపరచబడి లోతైన రక్షణ అనుభవాన్ని పొందాడు. 1936లో ”జిమ్మీ జాన్సన్” అను దైవజనునితో జైల్లో ఖైదీలను కలిసే అవకాశము వచ్చినప్పుడు గ్రాహంను సాక్ష్యం చెప్పమన్నప్పుడు ఎంతో కంగారుగా చెప్పి ముగించాడు..
అయితే ఆ తర్వాత ఫ్లోరిడా కళాశాలలో చేరి మూడున్నర సంవత్సరాలు చదువుకుని గ్రీకు భాష, సంఘ చరిత్రలను బాగా నేర్చుకున్నాడు.. అక్కడే ఉంటూ ప్రసంగాలు సిద్ధపరుచుకుని బయట రాళ్ళ వద్ద నిలబడి, అడవులలోనూ, చిన్న పిల్లల ముందు ప్రసంగిస్తూ వాక్యాన్ని నేర్చుకున్నాడు… తర్వాత ఒకరోజు ఈస్టర్ నాడు 30 మంది ఉన్న సంఘంలో మొదటిగా ప్రసంగించాడు. కానీ ధారాళంగా బోధించలేక పోతున్నానని బాధపడేవాడు.. తర్వాత ఒక చర్చిలో ప్రసంగించినప్పుడు 39 మంది రక్షించబడడం ఆశ్చర్యానికి గురి చేసింది.. అప్పుడు బాప్టిస్ట్ సంఘకాపరిగా అభిషేకించబడినాడు.. 1940 తో కాలేజీ విద్య ముగిసింది..

చైనా దేశంలో సేవ చేస్తున్న ”డాక్టర్ నెల్సన్ బెల్” గారి కుమార్తె రూత్ ను వివాహము చేసుకున్నాడు.. ఆ తర్వాత ”యూత్ ఫర్ క్రైస్ట్ సంస్థ” ద్వారా రేడియోలో ప్రసంగించే అవకాశం వచ్చింది. దాని ద్వారా గొప్ప గొప్ప సందేశాలు అందించగా గ్రాహం గారి కీర్తి దేశమంతటా వ్యాపించింది. తర్వాత సభలలో మాట్లాడే అవకాశం వచ్చింది. ఎందరో యవనస్తులు రక్షింపబడ్డారు. అమెరికా, కెనడా దేశమంతటా సువార్తికునిగా సంచారము చేశాడు.. వీరు నివసిస్తున్న పట్టణంలోనూ, ఇంగ్లాండ్ దేశంలోనూ బహుగా వాడబడినాడు.. ఆ తర్వాత ”డాక్టర్ రిలే” అను వ్యక్తి ”నార్త్ వెస్ట్రన్ విద్యాసంస్థల” బాధ్యతను బిల్లీకి అప్పగించారు..ఆ స్కూలును బిల్లీ ఎంతో అభివృద్ధిలోనికి నడిపించాడు.. 1948లో స్విట్జర్లాండ్ లో యవనస్తుల సదస్సులో 27 దేశాల నుండి వచ్చిన నాలుగు వందల మంది మధ్య ప్రసంగించాడు.. అలా బిల్లీ గ్రహం యొక్క పరిచర్య, ఉజ్జీవ కూటములు విస్తరించసాగాయి. ”దేవుని ఆత్మ బిల్లీ గ్రాహంను శక్తితో నడిపించేది”….లాస్ ఏంజిల్స్ లో 700 సంఘాలు పాల్గొనిన ఉజ్జీవ కూటములలో మొత్తం 3,50,000 మంది హాజరయ్యారు… 3000 మంది మారుమనస్సు పొందారు.. బిల్లీ గ్రాహం వాక్యము ద్వారా ఎంతో మంది ప్రభువును తెలుసుకున్నారు.. తరువాత కొరియాలో యుద్ధం జరిగినప్పుడు బిల్లీ గ్రాహం గాయపడిన సైనికులను వాక్యము ద్వారా బలపరిచారు.. తరువాత లండన్, స్కాట్లాండ్, భారతదేశాలను దర్శించి గొప్ప సువార్త ప్రకటించారు.. అమెరికాలోని న్యూయార్క్ లో సువార్త కూటములు నిర్వహించగా 23,97,000 మంది పాల్గొనగా 61,148 మంది మారుమనస్సు పొందారు….తరువాత ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా, ఫిలదెల్ఫియా, దక్షిణ కొరియా దేశాలలో దేవుడు బలంగా బిల్లీ గ్రాహంను వాడుకున్నారు..తరువాత బిల్లీ గ్రాహం ”ఇవాంజలిస్టిక్ అసోసియేషన్” సంస్థను స్థాపించి 200 మంది సువార్తికుల ద్వారా పరిచర్య చేస్తున్నారు.. అలాగే ఎన్నో పత్రికలు, పుస్తకాలు కూడా రాశారు.. ”నా గమ్యం” అనే పుస్తకమును 17 లక్షల 50 వేల కాపీలను ముద్రించారు..అలాగే అనేకమైన పుస్తకాలు రాసి ప్రచురించారు.. 1956 లో ”క్రిస్టియానిటీ టుడే” అను మాస పత్రికను ప్రారంభించారు, 1960లో ”తీర్మానము” అను పత్రికను కూడా ప్రారంభించారు.. ఇంచుమించు ప్రతినెల 55 లక్షల కాపీలు ముద్రించబడుతున్నాయి.. నాలుగు వందల ట‌న్నుల పేపర్ ను దీనికొరకు వాడుతున్నారు‌. సువార్త సంబంధమైన అనేక చలన చిత్రాలు తీయడమే కాకుండా అనేక టీవీ కార్యక్రమాలు చేశారు…1993 నాటి లెక్కల ప్రకారము వీరు పరిచర్య ద్వారా 28 లక్షల 75 వేల మంది రక్షణ పొందినారు.. కోటి మందికి పైగా సువార్తను ప్రకటించారు.. అమెరికా అధ్యక్షులు తర్వాత గౌరవింపబడే వ్యక్తి బిల్లీ గ్రహం.. 2001లో సెప్టెంబర్ 11న అమెరికా దాడుల తరువాత జరిగిన సంస్కరణ సభలో జాతిని ఉద్దేశించి ఇది అమెరికా ఉజ్జీవానికి ఒక హెచ్చరిక అంటూ గొప్ప ప్రసంగం చేశారు.. 84 సంవత్సరాలు వచ్చి పార్కిన్సన్ అనే వ్యాధితో బాధపడుతున్నప్పటికీ సువార్త ప్రకటించడం మానలేదు.. చివరికి ఫిబ్రవరి 21 2018 లో మరణించారు.. తరువాత వీరి కుమారులు, కుమార్తెలు దేవుని సేవలో బాధ్యతగలవారుగా ఉన్నారు..

గొప్ప పలుకు:- ”నేను శక్తిహీనుడను, నేనెవరినీ మార్చలేను.. మారుమనస్సు కలిగించు దేవుని క్రియ జరిగించుటకు ఒక పని ముట్టును మాత్రమే..”

2128 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account