ఐడా స్కడ్డర్ జీవితచరిత్ర
పూర్తి పేరు:- ఐడా సోఫియా స్కడ్డర్
తల్లిదండ్రులు:- జాన్ స్కడ్డర్ దంపతులు
జన్మస్థలం:- తమిళనాడులోని,వెల్లూరు జిల్లా రాణీపేటలో
జననము:- 9 డిసెంబర్ 1870
మరణం:- 23 మే 1960
సేవాఫలితము:- క్రైస్తవ వైద్య మిషనరీగా తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుని భారత దేశంలో పేరుగాంచిన వైద్య కళాశాలను, వైద్యశాలలు స్థాపించింది…
వ్యక్తిగత సాక్ష్యము:-
ఐడా స్కడ్డర్ 1970 వ సంవత్సరం డిసెంబరు 9న తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో డాక్టర్.జాన్ స్కడ్డర్ గారి దంపతులకు జన్మించింది. ఈమె అమెరికా దేశం నుండి వచ్చిన మిషనరీ డాక్టర్ల కుటుంబంలో జన్మించింది.. ఈమె తాత జాన్ స్కడ్డర్ గారు 26 సంవత్సరాల వయస్సులో తన భార్యను తీసుకుని దక్షిణ భారతదేశంలో వైద్యమిషనరీగా వచ్చారు.. ఈయన కుమారులలో ఒకరైన జాన్ స్కడ్డర్ గారి కుమార్తెనే ఐడా సోఫియా స్కడ్డర్.. ఈ కుటుంబానికి చెందిన పిల్లలు అందరూ కూడా చిన్ననాటి నుండి భారతదేశంలో ఉన్న పేదరికాన్ని చూశారు.. తన చిన్నతనంలో వెల్లూరు జిల్లాలో కరువు వచ్చినప్పుడు వీరి తల్లిదండ్రులు బియ్యము, బట్టలు పంచిపెట్టడం, అలాగే చుట్టూ ఉన్న పేదరికాన్ని, దుఃఖాన్ని గమనిస్తూ ఉండేది.. కానీ తన ఎనిమిది సంవత్సరాల వయసున్నప్పుడు కుటుంబంతో తిరిగి అమెరికాకు వెళ్లారు.. కానీ వీరి తండ్రి, తల్లి భారతదేశంలో వైద్యసేవలు అందిస్తూ ఉండేవారు.. అమెరికాలో ఒంటరిగా ఉన్న ఐడా ఒకరోజు డిఎల్ మూడీ అనే బోధకున్ని కలుసుకొని వారి ప్రసంగాల ద్వారా బలపడి కొద్దిరోజుల్లోనే క్రీస్తుని రక్షకునిగా అంగీకరించింది.. కానీ అమెరికాలో విలాసవంతమైన జీవితానికి, పార్టీలకూ, షికార్లకు అలవాటుపడి తల్లిదండ్రులులాగా పేదవారికి సహాయపడాలనే ఆలోచన ఉండేది కాదు. ఒకరోజు భారత్ లో ఉన్న తల్లిదండ్రులు అనారోగ్యం పాలయ్యారు, వారికి సహాయం చేయాలని ఉత్తరము వచ్చినప్పుడు వెంటనే తన జీవితాన్ని ప్రక్కనపెట్టి భారతదేశం వచ్చింది. అప్పటినుండి తల్లిదండ్రులకు పరిచర్య చేయడం ప్రారంభించింది. తర్వాత తండ్రి ఇంటింటికీ వెళ్లి వైద్యం చేస్తున్నప్పుడు తన తండ్రితో పాటు వెళ్లి ప్రజలతో పరిచయం ఏర్పరుచుకునేది. ఒక రోజు రాత్రి తన జీవితము మార్పునకు దారి తీసింది..
ఒక రాత్రి ఒక బ్రాహ్మణుడు ఒంటరిగా ఉన్న తన దగ్గరకు వచ్చి “నా భార్య ప్రసవించడానికి సిద్ధంగా ఉంది వచ్చి సాయం చెయ్యి సహాయపడటానికి ఎవరూ లేరు” అని అడిగినప్పుడు ఐడా నాకు వైద్యము తెలియదు మా తండ్రిగారికి చెప్పి ఆయనను తీసుకుని వెళ్ళండి అని చెప్పింది. కానీ ఆ బ్రాహ్మణుడు మగవారు సహాయము చేయరాదు అంటూ తిరస్కరించాడు.. మరలా అదే రాత్రి మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి తమ భార్యలకు కూడా సహాయం చేయమంటూ వేడుకున్నారు. వారికి కూడా అదే సమాధానం ఇవ్వడంతో మగవారు సహాయము చేయరాదని తిరస్కరించి వెళ్ళిపోయారు.. ఏ సహాయము అందక ఉదయానికే ఆ ముగ్గురు స్త్రీలు మరణించారు.. అయితే ఐడా స్కడ్డర్ యొక్క హృదయము చలించిపోయి, తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయి చాలా కృంగిపోయింది. ఆ సమయంలో తన జీవితములో దేవుని యొక్క చిత్తమును గ్రహించి వైద్య విద్యను నేర్చుకుని భారతదేశానికి వైద్యాన్ని అందించాలని గ్రహించి అమెరికాకు ప్రయాణమై వెళ్లి వైద్య విద్యను నేర్చుకోవటం కొరకు కళాశాలలో చేరి వైద్యాన్ని నేర్చుకొనుటకు తన జీవితాన్ని సమర్పించింది. ఒకప్రక్క వైద్యవిద్యను నేర్చుకోవడమే కాకుండా భారతదేశంలో వైద్యశాలను స్థాపించడానికి డబ్బులు కూడా సేకరించేది.. చివరికి తన 30వ సంవత్సరంలో ఒక వైద్యురాలిగా ఒక వైద్యురాలిగా తిరిగి భారతదేశానికి వచ్చింది..
వైద్యశాలను నిర్మించటానికి సేకరించిన పదివేల డాలర్లను తనతో తీసుకొని వచ్చింది. అయితే ఆ సమయంలో ఈమెకు మరొక స్నేహితురాలు కూడా తోడై ఇరువురు ఒక రోడ్డు ప్రక్కన చిన్న వైద్యశాలను ప్రారంభించారు. కొంతకాలం అలా వైద్యం చేస్తూ అమెరికా నుండి స్నేహితులు పంపించే డబ్బుతో, అలాగే భారత్ లో రాబర్ట్ షల్ అనే వ్యక్తి తన భార్య జ్ఞాపకార్థంగా ఇచ్చిన డబ్బుతో ఒక వైద్యశాలను నిర్మించారు. అది స్త్రీలకు, పిల్లలకు చెందిన వైద్యశాలగా నిర్మించారు. తరువాత కొన్ని రోజులకు వెల్లూరులో పేరు గాంచిన సి.ఎం.సి వైద్య కళాశాలగా పేరు పొందింది. అలాగే స్త్రీల కొరకు ఒక వైద్య కళాశాలను నిర్మించింది. ఇప్పుడు అది స్త్రీ పురుషులు వైద్యులుగా శిక్షణ పొందే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ గా గుర్తింపు పొందింది. వైద్యంలో అనేకమంది తర్ఫీదు పొందటానికి అది కేంద్రంగా మారింది. వైద్యశాల ద్వారా క్రీస్తే పరమవైద్యుడిగా వుండి స్వస్థపరిచే ఇల్లుగా మారింది. తరువాత ఎంతోమంది రోగులను బాగుచేసి వారికి ఎంతో సేవ చేసింది. తద్వారా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించి తనలో క్రీస్తును చూసే విధంగా వైద్యం అందించుటలో తన జీవితాన్ని ప్రభువునకు సమర్పించుకున్నారు.. భారతదేశానికి తన జీవితకాలంలో గొప్ప వైద్య సేవలను అందించారు. చివరికి 23 మే 1960 సంవత్సరంలో మరణించారు..