బైబిలు వాక్యాధారంతో టెలివిజన్ కనుగొన్న జే.యల్.బయర్డ్
పూర్తిపేరు:- జాన్ లోగీ బయర్డ్
తల్లిదండ్రులు:- జాన్ బయర్డ్, జెస్సీ మోరిసన్ ఇంగ్లిస్ దంపతులు
జన్మస్థలం:- స్కాట్లాండ్ దేశం, హెలెన్స్ బర్గ్
జననం:- 1888 ఆగస్టు 13
మరణం:- 1946 జూన్ 14
వ్యక్తిగత సాక్ష్యం:- టెలివిజన్ కనుగొన్నది “JOHN LOGIE BAIRD” ఈయన తండ్రి పాస్టర్. ఈయన తన తండ్రి కోరిక మేరకు స్కాట్లాండ్ లోని హెలెన్స్ బర్గ్ అను ప్రాంతంలో పాస్టర్ గా దేవుని పని చేసేవాడు. అయితే జే.యల్.బయర్డ్ కు చిన్నప్పుడు నుండి ఏదో ఒకటి సాధించాలని, క్రొత్తదాన్ని కనిపెట్టాలని ఆరాటపడేవాడు. అయితే జే.యల్.బయర్డ్ యొక్క తండ్రి యిట్టి కార్యములను ప్రోత్సహించలేదు. ఎక్కడ లోకంలో పడి దేవుని పనికి దూరం అవుతాడో అనే కారణం చేత అతని తండ్రి ఎటువంటి సహకారం యివ్వలేదు. అయితే “యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో” లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పాస్ చేసుకొన్న జే.యల్.బయర్డ్ ఒక పక్క దేవుని సేవ చేస్తూనే ప్రపంచ ప్రజలకు ప్రయోజనకరమగునట్లు తాను చదువుకున్న చదువుని బట్టి ఏదైనా కొత్తది కనిపెట్టాలని గొప్ప వ్యక్తిగా రాణించాలన్న దాహం అతనిలో తీవ్రంగా ఉండేది… అలా ఒక రోజు తన కోరికను తన అక్క “ఆన్నీ” కు తెలియచేసాడు. అక్కయ్య నేను ఏదో ఒకటి కనిపెట్టాలనుకుంటున్నాను. అది ప్రపంచ ప్రజలందరికి ఉపయోగ పడాలని నాకొక మంచి ఆలోచన ఇవ్వమని తన అక్కయ్యను అడిగాడు జే.యల్.బయర్డ్.
అందుకు తన సహోదరి ఈలాగు ప్రశ్నించింది. బయర్డ్ గతవారం నాన్న గారు వాక్యం బోధిస్తున్నప్పుడు “అంత్య దినములలో పరలోకంలో నుండి యిద్దరు వ్యక్తులు వస్తారని వారిని కౄరమృగము చంపుతుందని, అప్పుడు ప్రపంచ ప్రజలందరూ వారి శవములను చూసి సంతోషించి, ఉత్సహిస్తారని” నాన్నగారు చెప్పారు… యిదెలా సాధ్యము? వారి శవములు జెరుసలేములో వుంటే ప్రపంచ ప్రజలందరూ ఎలా చూస్తారని ప్రశ్నించింది.
జే.యల్.బయర్డ్ అప్పటికి దేవుని సేవ చేస్తుండటంతో అతనికి బైబిల్ గురించి తెలుసు కనుక అతని సహోదరి ఆ ప్రశ్న వేయగానే జే.యల్.బయర్డ్ కి బైబిల్ లోని ప్రకటన గ్రంథం గుర్తొచ్చింది. మరియు ప్రజలకును, వంశములకును, ఆ యాభాషలు మాటలాడువారికిని, జనములకును సంబంధించినవారు మూడు దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు. ఈ యిద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు, ఉత్స హించుచు, ఒకనికొకడు కట్నములు పంపుకొందురు. (ప్రకటన 11:9-10).
నిజమే యెరుషలేము సంత వీధిలో పడి వున్న ఆ శవములను లండన్ లోని ప్రజలు, ఇండియాలోని ప్రజలు, స్కాట్లాండ్ మరియు యిలా ప్రపంచ భూనివాసులు అందరు చూడాలంటే టెలివిజన్ ద్వారానే సాధ్యం అని నిర్ణయించుకొన్న జే.యల్.బయర్డ్ అప్పటి నుండి టెలివిజన్ కనిపెట్టడానికి ప్రయత్నించాడు. కొన్ని సార్లు ప్రయోగాలలో విఫలం అయినా చివరకు 1928 లో టెలివిజన్ కనిపెట్టాడు. ఈరోజు మనం ప్రపంచ వార్తలను మన కంటి ముందు చూడగలుగుతున్నాము అంటే జే.యల్.బయర్డ్ కారణం. తన అక్క యిచ్చిన సలహా మేరకు దేవుని వాక్యం మీద విశ్వాసంతో టెలివిజన్ కనిపెట్టుటకు ప్రయత్నం చేసి విజయం సాధించాడు. క్రీ.శ. 95 లో టెలివిజన్స్ లేవు, రేడియోలు లేవు, కరెంట్ లేదు. యింత టెక్నాలజీ అసలు లేనే లేదు. కాని యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములో ఆ యిద్దరు శవములను ప్రపంచ ప్రజలందరూ చూస్తారని ఎలా రాసాడు? ఎందుకనగా రాసింది యోహానే అయినా రాయించింది దేవుడు. దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి కనుక దేవునికి ముందుగానే తెలుసు. మానవుని జ్ఞానం పెరుగుతుందని టెలివిజన్ను కనుగొంటారని. అందుకే దేవుడు తన పరిశుద్ద గ్రంథంలో జెరుసలేము సంతవీధిలో పడి వున్న ఆ యిద్దరు వ్యక్తుల శవములను ప్రపంచ ప్రజలందరూ చూస్తారని టెలివిజన్ కనిపెట్టక ముందే 1800 సంవత్సరాల క్రితమే రాయించాడు. నేడు మానవుడు తన జ్ఞానం ద్వారా కనిపెడుతున్నవన్ని కూడా బైబిల్ మరింత సత్యం అని బైబిల్ దైవగ్రంథం అని నిర్ధారణ చేస్తున్నాయి. అయితే చివరికి 1946 జూన్ 14 వ తేదీన ప్రభువు సన్నిధికి చేరుకున్నాడు….