జాన్ వెస్లీ జీవిత చరిత్ర

పూర్తి పేరు:- జాన్ వెస్లీ
జన్మస్థలం:- ఇంగ్లాండ్ లోని ఎప్ వర్తు
తల్లిదండ్రులు:- సామ్యూల్ వెస్లీ, సూసన్నా వెస్లీ
జననం:- 1703 జూన్ 17
మరణం:- 1791 మార్చి 2
రక్షణానుభవం:- 35 సంవత్సరాల వయసులో

సేవాఫలితం:- ఇంగ్లాండ్ దేశమంతట ఉజ్జీవ జ్వాలలు రగుల్కొల్పి ఇంగ్లాండ్ దేశాన్ని క్రీస్తు కొరకు సంపాదించెను..

వ్యక్తిగత సాక్ష్యం:- జాన్ వెస్లీ 1703 జూన్ 17వ తారీఖున సామ్యుల్ వెస్లీ, సూసన్నా వెస్లీ అను దంపతులకు కలిగిన 19 మంది బిడ్డలలో 15వ వాడిగా జన్మించెను. ఆ 19 మందిలో 10 మంది మాత్రమే బ్రతికారు. వారిలో జాన్ వెస్లీ ఒకరు. వెస్లీ కూడా తన ఆరవ సంవత్సరంలోనే భయంకరమైన అగ్ని ప్రమాదంలో మరణించినవలసియుండెను. కానీ అతని కొరకు గొప్ప ఉద్దేశం కలిగిన దేవుని కృప అతనిని కాపాడెను. వెస్లీ తండ్రి బోధకుడు. తల్లి చిన్నవయసు నుంచే బిడ్డలను దేవుని భయభక్తులులో పెంచింది. వెస్లీ దేవుని భయభక్తులయందును, జ్ఞానమునందును పెరుగుతూ, తన 15వ సంవత్సరంలో ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీలో చేరి తన విద్యాభ్యాసమును కొనసాగించెను. తన 23 వ సంవత్సరానికి M.A. పూర్తి చేయడమే కాక లాటిన్, గ్రీకు, హెబ్రీ, ఫ్రెంచి మొదలగు భాషలలో ఆరితేరినవాడాయెను. వెస్లీ తల్లిదండ్రులు ఇతనిని సేవకు ప్రత్యేకించిరి. వ్యక్తిగతంగా వెస్లీ అపవిత్రమైన కార్యాలకు చోటు ఇవ్వనందున తాను పరిశుద్ధుడను అనే అభిప్రాయము కలిగియుండెను. తన తండ్రి పాస్టర్ అయినందున తాను కూడా తన తండ్రి సేవలో కొనసాగాలని జాన్ వెస్లీ తన్నుతాను దేవుని కొరకు సమర్పించుకొనెను. ఉదయము, సాయంకాలము క్రమముగా బైబిల్ చదువుకొనుటయు చర్చికి వెళ్లుటయు తన భక్తికి ఆధారమనుకొనుచుండెను. వ్యభిచారము, దొంగతనము మొదలగు అసహ్యకరమైన పాపములు తాను చేయుటలేదు కాబట్టి చాలా మంచివాడు అని అనుకొనుచుండెను. కానీ తన స్వనీతి, గర్వము, అవిశ్వాసం అనునది రక్షణకు అడ్డుగా ఉందని తాను గ్రహించలేకపోయాడు.

అయితే ‘క్రీస్తు అనుకరణ’ అను పుస్తకమును చదివిన తరువాత తన అభిప్రాయాన్ని మార్చుకుని బాహ్యశుద్ధికంటే అంతరంగశుద్ధి ముఖ్యమని నిజమైన భక్తి బహిరంగ క్రియలను చేయుటకాదు కానీ అంతరంగంలో ఉండవలసినది అని గ్రహించి దేవునిముందు తన నీతి క్రియలు మురికి గుడ్డలు వంటివని గుర్తించెను. అయినప్పటికీ లోతైన రక్షణా అనుభవము లేదు. తన పరిచర్యలో ఆత్మలు రక్షించబడడం కూడా చూడలేకపోయాడు. 1735 అక్టోబర్ 18న చార్లెస్ వెస్లీ ఇద్దరూ కూడా అమెరికాకు మిషనరీలుగా ప్రయాణమయ్యారు.. ఓడలో ఒకరు వెస్లీని నీవు రక్షించబడినావా అని ప్రశ్నించారు. అందుకు జాన్ వెస్లీ చిన్న వయసు నుండి పరిశుద్ధముగా ఉన్నాను, దేవుని సేవకు సమర్పించుకున్నాను అని సమాధానమిచ్చాడు.. అయితే రక్షణ క్రియల వలన కాదు వ్యక్తిగతంగా సంపాదించుకోవాలి అని ఆయన జవాబిచ్చారు. అయితే మరొకరు ఏసుక్రీస్తు నీ రక్షకుడైనాడా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న ద్వారా జాన్ వెస్లీ లోతైన రక్షణ అనుభవములోనికి నడిపించబడ్డాడు. ఆ తర్వాత ఎక్కువగా ప్రార్థనలో గడుపుచు ఆత్మల రక్షణార్ధమై సేవ చేయుచుండెను. ఎక్కువగా ప్రార్థనలో గడపటం వల్ల సేవ అభివృద్ధి చెందినది. ప్రతీరోజు 4 గంటలకు ప్రార్థించేవాడు. 7 గంటలకు వీధులలో ప్రసంగించడం మొదలుపెట్టేవాడు. లండన్ వీధుల్లో ప్రసంగిస్తుండగా వర్షము కురియుచున్నను ప్రజలు దేవుని వాక్యము వినుచుండేవారు. పశ్చాత్తాపము, మారుమనస్సు పాపక్షమాపణ గురించి నొక్కి చెప్పేవాడు. ఆయనను ఇష్టపడని క్రైస్తవ దేవాలయములు ఆయనకు ఆహ్వానము పలకలేదు. అయితే తాను గుర్రం మీద ప్రయాణం చేస్తూ వీధుల్లో ప్రసంగిస్తూ ఉండేవాడు. ఎంతోమంది మారుమనస్సు పొందేవారు. పరిచర్య అంతకంతకూ విస్తరించి ఇంగ్లాండ్ దేశంలో ఉజ్జీవ జ్వాలలు రగులుకొనెను.

తన పరిచర్యకు తోడుగా చార్లెస్ వెస్లీ సంగీతము ద్వారా మంచి పాటలు పాడుతూ ఉండేవాడు. ”లోకమే నా నివాసస్థలము” అని రాత్రనకా, పగలనకా ప్రసంగించుచుండెను. ఆయన ప్రసంగాలు వినిన ప్రజలు పాపములు ఒప్పుకొని కన్నీటితో ప్రార్థించుచూ విడుదల పొందేవారు. అలా అనేక ఆత్మలు సంపాదిస్తూ ఇంగ్లాండ్ లో మాత్రమేకాక ఐర్లాండ్ అమెరికా కెనడా మొదలగు దేశములలో సేవ ప్రారంభించి మెదడిస్ట్ సంఘ స్థాపనకు కారకుడయ్యాడు. ప్రతి ప్రయాణం వెనుక, ప్రసంగము వెనుక ఎంతో కన్నీటి ప్రార్ధన ఉండేది. అయితే జాన్ వెస్లీ ఎప్పుడు ధనాపేక్షకు చోటివ్వలేదు. ”డబ్బు- పెంట, పేడ; దానిని నేను వెదకను, ఆశించను, దాని కొరకు నేను ప్రయాసపడను అంటుండేవాడు. అందుకే తన సంపాదన సంవత్సరానికి 30 పౌండ్లు ఉన్నప్పుడు 28 పౌండ్లు ఖర్చు చేసుకుని రెండు పౌండ్లు దేవుని సేవ కొరకు ఉపయోగించేవాడు..తరువాత సంవత్సరమునకు తన అదాయము 60 పౌండ్లు అయినప్పటికీ 28 పౌండ్లు ఖర్చు చేసుకుని మిగిలినది సేవకు ఖర్చు పెట్టేవాడు. అలా తన ఆదాయము నాలుగు సంవత్సరాలకు 120 పౌండ్లు అయినప్పటికీ తన సొంత ఖర్చులకు కేవలం 28 పౌండ్లు మాత్రమే ఖర్చు చేసుకుని మిగిలిన సొమ్మును దేవుని సేవకు ఖర్చు పెట్టేవాడు. ఇలా ఆదా చేసిన సొమ్మును దేవుని సేవకు మాత్రమే ఉపయోగించేవాడు. మొత్తం తన సేవా జీవితంలో 2,250,000 వేల మైళ్ళు ప్రయాణము చేసి 4000 ప్రసంగాలు చేశాడు. మీటింగ్స్ లో ఎప్పుడూ 20వేల మంది జనం ఉండేవారు. అలాగే తన సువార్త సేవ కోసం తన సొంత ధన నిధి నుండి 30 వేల డాలర్లు ఖర్చు చేశాడు. చివరికి తన 86 వ ఏట రోజుకు రెండు సార్లు కూడా ప్రసంగించలేకపోతున్నాను అని బాధపడేవాడు. అలాగే ఉదయం 5:30 గంటల వరకు పడుకోవాలనె ఆశ కలుగుతుంది అని తన డైరీలో రాసుకున్నాడు. చివరికీ రష్యాలో సేవ చేస్తున్నప్పుడు తీవ్రమైన జ్వరం వలన 1791 మార్చి 2వ తేదీన ప్రభువునందు నిద్రించారు. ఆ సమయంలో ‘దేవుడు మనకు తోడుగా ఉన్నాడు’ అని చివరిగా పలికాడు.

గొప్పపలుకు:- ప్రభువా నీ కొరకు కాలిపొనీ కానీ నన్ను తుప్పుపట్టనియ్యవద్దు.. నిష్ప్రయోజనమైన జీవితము జీవించినీయవద్దు అని ప్రార్థించేవాడు..

1284 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account