

మేరీ స్లెస్సర్ జీవిత చరిత్ర *(1848-1915)
పూర్తిపేరు:- మేరీ స్లెస్సర్
తల్లిదండ్రులు:- రాబర్ట్ స్లెస్సర్, మేరీ స్లెస్సర్
జన్మస్థలం:- స్కాట్లాండ్ దేశంలోని ఆవర్ధన్ పట్నం జననం:- 1848 డిసెంబర్ 2
మరణం:- 1915 జనవరి 13
రక్షణానుభవం:- 11 సంవత్సరాల వయసులో
సేవాఫలితం:- ఆఫ్రికా ప్రజల మధ్య సేవ చేసి అనేక మంది మొరటు ప్రజలను మార్చగలిగేను..
వ్యక్తిగత సాక్ష్యము:-
మేరీ స్లెస్సర్ స్కాట్లాండ్ దేశంలోని ఆవర్థన్ పట్టణంలో 1948వ సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన ఒక పేద కుటుంబంలో జన్మించెను.. తండ్రి చెప్పులు కుట్టుకునే వాడు, తల్లి నూలు మిల్లులో పని చేసేది. తండ్రి తాగుడుకు బానిస. వారికి కలిగిన ఏడుగురు సంతానంలో మేరీ రెండవ కుమార్తె. తన 11 సంవత్సరాల వయసులోనే ఒక నూలు మిల్లులో పని చేస్తూ ఒక పూట మాత్రమే చదువుకునేది. మేరీ ఒక పరిశుద్ధ సహవాసంలో లోతైన రక్షణ అనుభవం ఉంది.. ఏసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించింది, మారుమనస్సు పొందిన తరువాత తనకు ఉన్న కొద్ది చదువుతో బైబిల్ ను, ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతూ ఉండేది. పగలంతా పనిలో, రాత్రంతా చదువుటలో శ్రద్ధ వహించేది. మిషనరీల చరిత్రను బాగా చదివేది.
అనాగరికులైన ఆఫ్రికా జనుల మధ్యకు మిషనరీగా వెళ్ళిన డేవిడ్ లివింగ్ స్టన్ జీవిత చరిత్ర ఆమెను ఎంతగానో కదిలించెను. తాను అటువంటి జనుల మధ్య సువార్తను ప్రకటించాలని ఆశించేది. మొదట ఆమె ఉన్న స్థలంలో మురికి వాడలో ఉన్న వారిని ప్రభువులో నడిపించుటకు ప్రయాసపడెను. ఆత్మల రక్షణకై ఆవేదనతో ప్రార్థిస్తూ, సండే స్కూల్ టీచర్ బాధ్యతను కూడా వహించెను. 1873లో డేవిడ్ లివింగ్ స్టన్ మరణవార్త ఆమెను ఎంతగానో కలవరపరిచేను. అప్పటికీ మేరీ వయస్సు 24 సంవత్సరాలు మాత్రమే.. అయిననూ తెల్లవాల్ల సమాధిగా పేరుపొందిన ఆఫ్రికా దేశమునకు మిషనరీగా వెళ్ళుటకు తెగించి స్కాట్లాండ్ దేశంలో యునైటెడ్ చర్చి వారి సహాయంతో 1876 ఆగస్టు 5న ఆఫ్రికా దేశంలోని ”కేలబార్ ” అనే ప్రదేశమునకు ప్రయాణమయ్యెను.. మేరీ ఆఫ్రికా దేశంలోని స్త్రీలను పరామర్శిస్తూ, పిల్లలకు విద్యను అభ్యసింపచేస్తూ వారి కష్టాలు తెలుసుకునేది, వారిపట్ల సానుభూతితో వ్యవహరించేది, వారికి క్రీస్తును గురించి బోధించేది.. భయంకరమైన విగ్రహారాధన, నర బలులతో కూడిన పనులు చేసే మూర్ఖులైన ఆ జనులమధ్య, క్రూర జంతువులతో నిండి ఉన్న అడవిలో ప్రభువు కొరకు నిలబడడానికి ఆమె ఎంతగానో ప్రార్ధించి, ప్రభువుపై ఆధారపడి జీవించేది.. రెండు సంవత్సరాలు వారి మధ్య నిర్విరామంగా కృషి చేసి అనేకులను ప్రభువు పాదముల యొద్దకు నడిపించెను. ఆ తర్వాత ఆమె మరింత భయంకరమైన ”ఓకోయాంగో” అనే ప్రాంతానికి వెళ్లడానికి ఆశించింది. వారి యొద్దకు అంతవరకు ఎవరు వెళ్ళడానికి సాహసించలేదు. వారు బహు క్రూరులు, మూర్ఖులు వారు చేసే అమానుష రాక్షసకృత్యాలు వినడానికి ఎంతో భయంకరంగా ఉండేవి. ఎటువంటి దయ దాక్షిణ్యాలు లేని నరమాంస భక్షకులు. అటువంటి వారి మధ్య సేవచేయుటకు 1818 ఆగస్టు 3వ తేదీన యాంకెంగె గ్రామమునకు బయలుదేరెను. 12 సంవత్సరాలుగా ఆమె ప్రేమను చవిచూసిన ఆ కెలబార్ గ్రామ ప్రజలు ఆమెను నరమాంసభక్షకుల మధ్య సేవ చేయుటకు వెళ్ళుచుండగా కన్నీటితో సాగనంపిరి. వీరి మధ్య మేరీ ఏఫిల్ భాష నేర్చుకునెను..
మేరీ తను ఎదుర్కొన్న కష్టములను లెక్కచేయక క్రీస్తు వైపు చూస్తూ ఒక పూరి గుడిసెలో నివాసం ఏర్పరచుకొని విశ్వాసముతో, పట్టుదలతో, ప్రార్థనతో పాపులను ప్రేమించి, క్షమించి, రక్షించగల యేసు ప్రభువును గూర్చి చెప్తూ ఉంటే ఆ దుష్ట ప్రజలు ఆశ్చర్యపోవుచుండిరి.. ఆమె క్రీస్తు ప్రేమతో ఎటువంటి హృదయాన్నైనా ఆకర్షించేది. ఈ ఒకోయాంగో ప్రజలు బహు క్రూరులు.. వీరిలో ముఖ్యులు మరణిస్తే అతని ఆత్మ శాంతి కొరకు కొందరు మనుషుల్ని బలి ఇచ్చేవారు.. అనగా సతీసహగమనం జరిపించేవారు. కవల పిల్లలు పుడితే అది శాపమని తలంచి ఆ పిల్లలను చంపేవారు. తల్లిని తరిమి చంపేవారు.. మేరీ ఇలాంటి మూర్ఖుల అలవాట్లనుండి వారిని తప్పిస్తూ అలాంటివారికి ఆశ్రయమిచ్చెను..
పది సంవత్సరాలలో ఆ ప్రాంతం పూర్తిగా మారిపోయెను.. నరబలులు, దురాచారాలు, త్రాగుడు మొదలగు దురలవాట్లు మానివేసి అనేకులు ఏసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించారు.. ఆత్మ శాంతిని, ఆత్మానందమును పొందిరి.. భయంకరమైన ఈ ప్రాంతము సమాధానమునకు నిలయంగా మారింది.. అనేక పాఠశాలలు, ప్రార్థనా మందిరాలను కట్టించింది. ఆదివారము ఇంచుమించు పది మైళ్లకు పైగా ప్రయాణిస్తూ 12 స్థలములో బోధించేది…ఆమె అనేక బలహీనతలకు, కీళ్ళవాతమునకు గురియాయెను… అయినను ఆమె ప్రదేశమునకు వెళ్ళి విశ్రాంతి తీసుకొనక ఒక చక్రాల కుర్చీలో కూర్చుని సేవను కొనసాగించెను.. సమస్త సుఖ సాధనములకు దూరముగా ఉండి ఏకాకిగా 40 సంవత్సరాలు అహర్నిశలు ఆత్మల రక్షణార్థమై పోరాడి, ప్రభువు కొరకై తన జీవితమును అర్పించిన మహనీయురాలు.
ఈ వీరనారి ఎన్నో అనారోగ్యాలకు గురైనను తన స్వదేశమైనకు అనగా స్కాట్లాండ్ వెళ్లే తలంపే రానివ్వలేదు.. వృద్ధాప్యము వలన కదలలేని పరిస్థితులు ఏర్పడినప్పటికీ ప్రభువు సేవలోనే ఉండేది. తన చివరి దినములలో పడక మీద ఉన్నప్పటికీని కూడా పరలోకము గురించి ఆలోచిస్తూ ప్రార్థించుచుండెను.. మేరీ 1915 వ సంవత్సరము జనవరి 13వ తారీఖున అనగా తన 66 వ ఏట అక్కడే తన పోరాటం ముగించి ప్రభువు ఇచ్చు కిరీటమును పొందుటకు మహిమలో ప్రవేశించెను. అయితే ఆమె మరణించిననూ ఆ పాప దుర్గంధ పూరితమైన ఆ అనాగరిక జనుల మధ్య ఆమె వెదజల్లిన క్రీస్తు పరిమళ సువాసన ఈ నాటికీ పరిమళిస్తూనే ఉంది.. గొప్ప పలుకు:- ఈ ఆటవికులు క్రీస్తు శిష్యులు అయ్యారంటే ఇది నా ప్రజ్ఞ కాదు, ఇది ప్రభువు కృపే.