

గొప్పకులంలో పుట్టి కవిశ్వరులుగా పేరుపొంది క్రీస్తులోకి మారిన అన్నదమ్ముల జీవితచరిత్ర
పూర్తిపేర్లు:- రావూరి రంగయ్య, లక్ష్మయ్య
జన్మస్థలం:- నెల్లూరు జిల్లా
సంరక్షకుడు:- లక్ష్మీ నరసయ్య
వ్యక్తిగతసాక్ష్యం:-
నెల్లూరు గ్రామంలో జన్మించిన రావూరి రంగయ్య, లక్ష్మయ్య అను ఇద్దరు అన్నదమ్ములు వున్నారు వారి బాల్యంలోనే తలిదండ్రులు చనిపోయారు.
అనాధాలైన అన్నదమ్ములను పినతండ్రి లక్ష్మి నరసయ్య గారు చేరదీసి పెంచి పెద్దచేశాడు.
ఇద్దరి అన్నదమ్ములకు లక్ష్మీ నరసయ్య గారు పంచాంగంలో పాండిత్యం పౌరోహిత్యం అన్ని నేర్పించారు.
వీరిద్దరూ గొప్ప కవులు.
ఊరూరా వీధి వీధి తిరుగుతూ బ్రోచేవారేవారురా నను బ్రోచేవారేవారురా? అంటూ పాడేవారు…కొంతకాలం గడిచిన తర్వాత తమ్ముడైన లక్ష్మయ్య గారు క్రీస్తును విశ్వసించారు. అప్పటి నుంచి తన అన్నయ్య గారిని కూడా క్రీస్తుని విశ్వసించమని బ్రతిమిలాడేవాడు. తన అన్న కోసం ఒక కీర్తన కూడా వ్రాశారు. అన్న మన యేసుప్రభువు కన్న రక్షకుడు లేడు ఎన్నరాని మన యఘములన్ని సడలించి ప్రొచు (162 కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో) ఈ పాట పడుతూ అన్నయ్యను మార్చడానికి ప్రయసపడేవారు…రంగయ్య గారు తమ్మునితో అందరి దేవుళ్ళులానే యేసు ప్రభువు కూడా ఒక్కదేవుడు అని అపార్ధం చేసుకుని తూలనాడేవారు. కొన్ని రోజులకు రంగయ్య గారికి జబ్బు చేసింది. మంచం పట్టేశారు. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో లక్ష్మయ్య గారు అన్నతో ఇప్పటికైనా క్రీస్తును విశ్వసించు అన్నయ్య అని అడుగుతారు. నన్ను బాగుచేస్తే కచ్చితంగా క్రీస్తుని విశ్వసిస్తాను అని అంటారు రంగయ్య గారు. దేవుని కృపవలన కొన్ని రోజులకు రంగయ్య గారు స్వస్థత పడతారు. తాను చెప్పినట్టుగానే క్రీస్తు ప్రభుని విశ్వసిస్తాడు.
దేవుని ప్రేమ రుచి చూసిన రంగయ్య గారు ఆ క్షణంలో రాసిన పాటే ఈలాటిదా యేసుప్రేమ నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా!! (165 కీర్తన) అనే పాట రాశారు. అప్పటి నుంచి కవిశ్వరులైన అన్నదమ్ములు ప్రభువు కోసం గొప్ప గొప్ప కీర్తనలు వ్రాసారు. అవన్నీ దొరకలేదు కానీ కొన్ని మాత్రమే దొరికాయి అవి ఆంద్ర క్రైస్తవ కీర్తనలలో ఉన్నాయి….యేసునిభజియింపవేమనసా – నీ దోసములు చన చేసి కృపతో బ్రోచునే మనసా”” [80 కీర్తన] అనే గొప్ప కీర్తన లక్ష్మయ్య గారు రచించారు. అప్పటినుంచి ఊరూరా వీధి వీధి తిరుగుతూ యేసుని భజియింపవే మనసా అంటూ పాడుతూ క్రీస్తు ప్రేమను ప్రకటించేవారు. తాను పెంచిన తన అన్నగారి అబ్బాయిలిద్దరు క్రైస్తవ్యంలోకి వెళ్లినందుకు పినతండ్రి ఐన లక్ష్మీనరసయ్య గారు మనస్థాపానికి గురై చాలా బాధపడ్డారు. ఈయన రంగయ్య, లక్ష్మయ్య గారులకు పాండిత్యం, పౌరోహిత్యం నేర్పించారు. అవన్నీ విడిచి క్రీస్తులోకి వచ్చేసారు అన్నదమ్ములిద్దరు… కానీ లక్ష్మీనరసయ్య గారు కూడా చివరిదశలో క్రీస్తుని విశ్వసించి గొప్ప పాట వ్రాసారు ఆ పాటే
నీకన్న నిక వేరే వేల్పులులేరయ్యా నిజముగా నాయేసువా… (351 కీర్తన)
నిజంగా రంగయ్య, లక్ష్మయ్య గార్ల జీవితము గొప్పది.
క్రీస్తు కొరకు నిలబడి, క్రీస్తుకొఱకు కీర్తనలతో సువార్తను వ్యాప్తిచేశారు.
ఎన్నో ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించారు…
వీరు రాసిన పాటలు ఇప్పటికి క్రైస్తవ సంఘాలలో మారుమోగుతూనే ఉన్నాయి…