పూర్తిపేరు:- శామ్యూల్ పాల్ అయ్యర్
జననం: 15-06-1844
జన్మస్థలం: తమిళనాడు
మరణం: 11-03-1900

వ్యక్తిగతసాక్ష్యము:- రావు సాహెబ్ అనునది గౌరవార్థం ఇచ్చే బిరుదు. భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్నప్పుడు దేశానికి నమ్మకముగా సేవ చేసిన వారికి లేదా ప్రజా సంక్షేమ చర్యలను చేపట్టిన వ్యక్తులకు ఇది అందజేయబడింది. శామ్యూల్ పాల్ అయ్యర్ కూడా 1899వ సంll లో ఈ బిరుదు చేత గౌరవించబడ్డారు. దక్షిణ తమిళనాడులో ఉన్న శివకాశి అనే ప్రాంతం అల్లర్లతో నిండుకొనియుండగా, ఆ అల్లర్లను అణచివేసి శాంతిని నెలకొల్పుటలో శామ్యూల్ పోషించిన పాత్రను బట్టి అతనికి ఆ బిరుదు ఇవ్వబడింది. అక్కడి కలహాలలో జోక్యం చేసుకొనలేక అధికారులు ముఖం చాటువేసిన పరిస్థితులలో శామ్యూల్ అయ్యర్ ముందుకు వచ్చి ఆ కలహాలకు కారణమైన ఇరు విభాగాల మధ్య శాంతిని నెలకొల్పి వాటికి ఒక ముగింపు తీసుకువచ్చారు.

సెర్జెంట్ అయ్యర్ యొద్ద బైబిలు సిద్ధాంతాలను నేర్చుకొనిన శామ్యూల్ పాల్ అయ్యర్, తన గురువు యొక్క ఆశీర్వాదంతో ఉదకమండలంలో (ఊటీ) తొమ్మిది సంవత్సరాల పాటు సేవ చేశారు. ఎటువంటి మతభేదమూ లేకుండా అందరినీ ఆహ్వానించి వారిని ఒకటిగా కూర్చుండబెట్టి వారికి దేవుని ప్రేమను గూర్చి బోధించారు శామ్యూల్. సంత వీధులలో కూడా అతను దేవుని గురించిన సత్యమును ఎంతో సాధారణమైన భాషలో ప్రకటించేవారు. అంతేకాకుండా అతను తరచుగా ఖైదీలను దర్శించి వారితో సంభాషించేవారు. అది వారు ఒక నూతన జీవన విధానాన్ని ఎంచుకొనుటకు ఆ ఖైదీలకు దారిచూపింది. ప్రతి మాసము కూడా అతను నిర్వహించే “కథాకాలక్షేపం” (వేద సత్యాలను సంగీత శైలిలో బోధించుట) అనే కార్యక్రమాలు ప్రజలను సువార్తకు దగ్గరగా తీసుకువెళ్ళుటకు ఎంతో సహాయపడ్డాయి. నాలుగు సంవత్సరాలు చెన్నైలో పరిచర్య జరిగించిన తరువాత అతను శివకాశీకి సమీపంలో ఉన్న సాక్షియాపురం అనే ప్రాంతమునకు వెళ్ళి అక్కడి సంఘమునకు ప్రధాన కాపరిగా సేవలందించారు. అక్కడ అతను మంచి గాయకులతో, సంగీత వాయిద్యములతో ఒక గాయక బృందాన్ని ఏర్పాటు చేసి క్రైస్తవ సంఘములలో ఉజ్జీవం తీసుకువచ్చుటకు ఎంతగానో శ్రమించారు. “ఉపవాస పండుగ” అనునది మొదటిగా శామ్యూల్ పాల్ అయ్యర్ ద్వారానే ప్రారంభించబడింది.

దేవుని ముఖ ప్రసన్నతను వెదుకుటకును, సంఘములలో ఉజ్జీవం కొరకు ప్రార్థించుటకును వివిధ క్రైస్తవ సంఘములలో ఈ పండుగ ఈనాటికీ ఆచరించబడుచున్నది. 1890వ సంll లో ఒక క్రైస్తవ పత్రికకు సంపాదకుడిగాను మరియు స్థానిక సంఘములో సహాయక పాదిరిగాను పనిచేశారు. దేవుని ప్రేమలో ఎదుగునట్లు ఈనాటికీ అనేక మంది క్రైస్తవ విశ్వాసులను ప్రోత్సహిస్తున్న 42 పుస్తకములను అతను వ్రాశారు. అతను జాన్ బన్యన్ వ్రాసిన “పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్” (తెలుగులో “యాత్రికుని ప్రయాణం”) అనే పుస్తకము యొక్క పలు అనువాదములలో ఒక దానిని తమిళ భాషలోనికి అనువదించారు. చివరి వరకు కూడా క్రీస్తు కొరకు ఎంతో శ్రమించి నమ్మకముగా సేవ చేసిన శామ్యూల్ పాల్ అయ్యర్, 1900 వ సంllలో మార్చి నెలలో పరలోక మహిమలోనికి ప్రవేశించారు.

317 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account