విద్యుత్ బల్బును కనుగొన్న థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క సాక్ష్యము

పూర్తిపేరు:- థామస్ ఆల్వా ఎడిసన్
తల్లిదండ్రులు:- శామ్యూల్ ఆగ్డెన్ ఎడిసన్, నాన్సీ మాథ్యూస్ ఎడిసన్ దంపతులు
జన్మస్థలం:- అమెరికాలోని ఓహియో రాష్ట్రానికి చెందిన ‘మిలన్’ అనే ప్రాంతం
జననము:- ఫిబ్రవరి 11, 1847
మరణము:- అక్టోబర్ 18, 1931

వ్యక్తిగతసాక్ష్యము:-
థామస్ ఆల్వా ఎడిసన్ ఫిబ్రవరి 11, 1847 న అమెరికాలోని ఓహియో రాష్ట్రానికి చెందిన మిలన్ అనే ప్రాంతంలో జన్మించి మిషిగాన్ రాష్ట్రంలోని పోర్టుహ్యురాన్ అనే ప్రదేశంలో పెరిగాడు. తండ్రి శామ్యూల్ ఆగ్డెన్ ఎడిసన్ దంపతులకు ఏడవ మరియు చివరి సంతానంగా జన్మించాడు. ఇతని కుటుంబం డచ్ మూలాలు కలిగినది. ఎడిసన్ ను 7 సంవత్సరాల వయస్సులో స్కూలుకు తీసుకొని వెళ్లారు. అయితే ఎడిసన్ పుట్టినప్పటి నుండి ఆరోగ్య పరంగా చాలా బలహీనముగా ఉండేవాడు, మానసికముగా కూడా వెనుకబడినవాడు. ఎవరైనా ఏదైనా చెప్పినా అర్ధం చేసుకునే శక్తి తనకు ఉండేది కాదు, దిక్కులు చూస్తూ నవ్వుకొంటూ ఉండేవాడు. తరువాత అక్కడ స్కూలులో తోటి స్నేహితులు కూడా హేళన చేస్తుంటే, టీచర్ కూడా వీడు పనికి రాడు, తీసుకుని వెళ్ళండి అని చెప్పేసరికి తన తల్లి నాన్సీ ఎడిసన్ హృదయం ఎంతగానో క్రుంగిపోయింది. అప్పుడు ఎడిసన్ తల్లి అక్కడ ఉన్న వారందరితో ఛాలెంజ్ చేసి “మీ అందరికంటే నా కుమారుడు గొప్పవాడుగా రాణించకపోతే నేను దేవుని బిడ్డను కానే కానని” సవాలు చేసి, తన కుమారుడు ఎడిసన్ ని ఇంటికి తీసుకొని వెళ్ళింది. అప్పటి నుండి తన తల్లి ఒడియే బడిగా మారింది ఎడిసన్ కి. దేవుని నామమున చేసిన ఛాలెంజ్ మేరకు ఒకసారి కన్నీటి ప్రార్థనతో అతనికి చదువు నేర్పుటకు ప్రారంభించింది తల్లి నాన్సీ ఎడిసన్. నిజముగా ఆ తల్లి కన్నీటి ప్రార్థన ఫలితముగా మంచి జ్ఞాపక శక్తిని అనుగ్రహించాడు దేవుడు. ఆపై తల్లి చెప్పే ప్రతీది గ్రహిస్తూ తనకు తానే చదువుకొనే శక్తిని పొందాడు. థామస్ ఆల్వా ఎడిసన్ కి 16 సంవత్సరాల వయసులో “టెలిగ్రాఫిస్ట్” పని దొరికినది. కొద్ది రోజుల తరువాత సంఘ కాపరి, తల్లి నాన్సీ సహకారంతో ఒక లాబరేటరీ కూడా ప్రారంభించాడు. అలా తన తల్లి ప్రార్థన ద్వారా దేవుని సహకారంతో ఎదుగుతూ ముందుకు వెళ్ళాడు ఎడిసన్. కొన్ని సంవత్సరాల తరువాత విద్యుత్ బల్బును కనిపెట్టడానికి ప్రయత్నం మొదలు పెట్టాడు ఎడిసన్. ప్రార్థన చేస్తూ తన పని ప్రారంభించాడు.

సెప్టెంబర్ 4, 1882లో న్యూయార్క్ సిటీలో వేలాది మంది ప్రజలు చిమ్మ చీకటి ప్రదేశంలో కూడా ఉండగా, విధ్యుత్ బల్బును వెలిగించడానికి సిద్దపడ్డాడు థామస్ ఆల్వా ఎడిసన్. ప్రార్థనతో కూడిన ప్రయాస పలితముగా స్విచ్ ఆన్ చేసాడు ఎడిసన్, అంతే ఏకధాటిగా 1000 దీపాలు వెలిగాయి. దానితో ఆ ప్రాంతమంతా వెలుగుమయం అయింది. ప్రజలంతా ఎడిసన్ కి జేజేలు కొట్టి చీకటికి గుడ్ బై చెప్పారు.
ఆ రోజు అందరూ థామస్ ఆల్వా ఎడిసన్ ని ప్రశంసిస్తూ, ఆయనను ఘనపరచి, తనని మాట్లాడమన్నపుడు, ఎడిసన్ తన తల్లి గురించి, బైబిలు గురించి చెప్పాడు. “నా తల్లి కన్నీటి ప్రార్థన నన్ను మనిషిగా మార్చింది, ఆమె చేసిన కన్నీటి ప్రార్థనే ఈరోజు నన్ను మీ మధ్య ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది” అని చెప్పాడు. తరువాత బైబిలు గురించి మాట్లాడాడు, ఒక రోజు మా పాస్టర్ గారు చెప్తున్న దేవుని వాక్యం వినుచుండగా అప్పుడు యోబు 28:3 వచనమును చదివించి దానిని అత్మీయముగా భోదించారు. మనిషి చీకటి అనే పాపమునకు అంతం కలుగజేసి వెలుగు అనే క్రీస్తులోనికి రావాలని వివరించారు. అయితే ఆ మాటను ఇంటికి వచ్చిన తరువాత నా గదిలోనికి వెళ్లి మరలా చదివాను. మనుష్యులు చీకటికి అంతము కలుగజేయుదురు గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదకుచు వారు భూమ్యంతముల వరకు సంచరింతురు. (యోబు 28:3)

ఈ వాక్యం దైవజనులు ఆత్మీయ అర్థముతో చెప్పారు, అయితే నేను అక్షరార్ధముగా ప్రయత్నించి, బైబిలు ప్రవచనం నెరవేర్చడానికి తలంచి యోబు 28:3 వాక్యం మేరకు ప్రయత్నించాను, దేవుడు నా ప్రయత్నం సఫలం చేసాడు. నేను బల్బును కనిపెట్టుటకు కారణం బైబిలులోని వాక్యం (యోబు 28:3) అని సాక్షమిచ్చాడు థామస్ ఆల్వా ఎడిసన్. 1879వ సంవత్సరంలో బల్బును కనుగొన్న ఎడిసన్ 1882లో ప్రయోగాత్మకముగా బల్బును వెలిగించి, దీనికి మూల కారణం పరిశుద్ధ గ్రంధంలోని ఒక వచనమే అని స్పష్టం చేసాడు. దేవునికే మహిమ కలుగును గాక, ఆమెన్.

గొప్పపలుకు:- “నా తల్లి కన్నీటి ప్రార్థన నన్ను మనిషిగా మార్చింది, ఆమె చేసిన కన్నీటి ప్రార్థనే ఈరోజు నన్ను మీ మధ్య ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది..”

747 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account