విలియం బూత్ జీవిత చరిత్ర

పూర్తిపేరు:- విలియం బూత్
జన్మస్థలం:- ఇంగ్లాండ్ లోని నాటింగ్ హమ్
భార్యపేరు:- కేథరిన్
జననం:- 1889 ఏప్రిల్ 10
మరణం:- 1912 ఆగస్టు 20
రక్షణానుభవం:- 13 సంవత్సరాల వయసులో
సేవాఫలితము:- soup-soap-salvation అనే ధ్యేయంతో Salvation Army స్థాపించి అనేక మంది పేదలను ప్రభువు కొరకు సంపాదించెను..

వ్యక్తిగతసాక్ష్యం:- విలియం బూత్ ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు. ఈయన తల్లి మంచి భక్తిపరురాలు. ఈయన తండ్రి కష్టపడి చాలా డబ్బు సంపాదించెను కానీ దురదృష్టవశాత్తు అదంతా పాడైపోయినందున విలియం బూత్ పేదరికంలోనే పెరిగెను. అతని చిన్న వయసులోనే అతని తండ్రి మరణించెను. అల్లరిగా పెరుగుచున్న విలియం బూత్ తన ఏడు సంవత్సరాల వయసులోనే పరిశుద్ధంగా ఉండవలెనని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ ఆ నిర్ణయాలు నిలబెట్టుకోలేకపోయేవాడు. తండ్రి లేకపోవడంవల్ల సరైన విద్య లేదు. 13వ యేట దేవుని వాక్యం వింటున్న ఈయన మనస్సాక్షిచేత బంధించబడి తన తల్లిదండ్రులకు ఆవిధేయుడైన విషయమై, తన పాపముల విషయమై పశ్చాత్తాపపడి, మారుమనస్సు పొంది యవ్వనప్రాయంలోనే తన హృదయమును దేవునికి ఇచ్చెను. సంపూర్ణంగా తన పాప జీవితాన్ని విడిచి ప్రభువుకు తన్నుతాను సమర్పించుకున్నాడు.

‘జేమ్స్ కాగరి’ అనే సువార్తికుని ప్రసంగాలు విన్న ఈయనకు పరిశుద్ధతో జీవించాలని, అలాగే క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించాలని ఆరాటపడేవాడు. కానీ ప్రార్థనలు జరిపించుటకు భయపడేవాడు. అయినప్పటికీ వాక్యము చదివుటలో, ప్రార్ధించుటలో సమయం గడిపేవాడు. వీధి మూలల్లో నిలబడి వాక్యం ప్రకటించుచు ఉండగా మనుషులతో హేళన చేయబడడమే కాకుండా ఇటుకలతో కొట్టబడేవాడు. నిరుత్సాహపడక సువార్త సేవలో పాలు పొందేవాడు. ఏడు సంవత్సరాల వయసులోనే ప్రసంగీకునిగా పేరు పొందాడు..విలియం బూత్ పేదప్రజల మధ్య సేవ చేయాలని ఆశపడేవాడు. జాలి, దయకలిగిన ఈయన పేదప్రజల పరిస్థితిని చూచి వారి కొరకు భారంతో ప్రార్థించి, వారితో స్నేహంగా మెలిగేవాడు. ఆ పేదవారు త్రాగుడు, జూదము లాంటి దురలవాట్లకు బానిసలై మరింత పేదలగుట చూచి వారిని రక్షణలోనికి నడిపించాలని ఆశపడేవాడు. ఆ తరువాత ఆయన సేవలో సహకారిగా ఉండుటకు ‘కేథరిన్’ తో వివాహము జరిగెను. వీరిద్దరూ కలిసి భక్తుల జీవితచరిత్రలను చదువుతూ పరిశుద్ధజీవితము, హృదయశుద్ధి అనే అంశాలను ధ్యానించి బోధించుచుండిరి. అనేకమంది మిషనరీలతో కలిసి దేవుని సేవలో సహకారిగా ఉండిరి. వీరికి ఎనిమిది మంది పిల్లలు. వారు కూడా దేవుని సేవలో ఉండాలని ప్రార్థించేవారు. వీరి సేవా పరిచర్యలో రక్షించబడినవారు విద్య లేనివారే కానీ వారి సాక్ష్యం ద్వారా అనేకులు మారుచుండిరి. వీరంతా క్రీస్తు సైన్యంగా బయలుదేరి అనేక ఆత్మలను రక్షించుచుండిరి. విలియం బూత్ ”రక్షణసైన్యము” అనే సంస్థను స్థాపించెను.

ఒకే ఆలయంలో కాక ఆయా ప్రదేశములు తిరుగుతూ సువార్త ప్రకటించుచుండెను. కొన్ని సార్లు గుడారములు వేసి ఉజ్జీవ కూటములు జరిపినప్పుడు అనేకులు రక్షించబడుచుండిరి. Soup-Soap-Salvation (ఆహారము-శుభ్రత-ఆత్మరక్షణ) అను ధ్యేయంతో ఆయన సువార్త చెప్పుటయె కాక ఆ ప్రజలపట్ల శ్రద్ధ వహించి వారి దేహ అవసరాలను కూడా తీర్చవలసిన అవసరం ఉంది అని నిరూపించాడు. ఎల్లప్పుడూ విలియం బూత్ మరియు తన భార్య ఇరువురు కూడా పేద ప్రజల అవసరాలను గుర్తించి వారి కొరకు ప్రార్థించేవారు. వీధుల్లో బోధించుట, బహిరంగ కూటములు, స్త్రీలమధ్య పరిచర్య వీరి దినములలో బహుగా కొనసాగుచుండేవి. తల్లి-తండ్రి అని పిలువబడే వీరి దంపతుల ద్వారా వేల వేల ఆత్మలు రక్షణలోనికి నడిపించబడిరి. వీరు పట్టణములు, గ్రామములు తిరిగి ప్రభువును ప్రకటించిరి. వీధులలోనూ, ఫ్యాక్టరీలలో, మురికివాడలలోను వీరి పరిచర్య విస్తరించెను. ఈ గొప్ప సేవ నేటికిని 90 దేశాలలో కొనసాగుచున్నది. విలియం బూత్ గొప్ప సువార్తికుడుగాను, దేవుని ప్రేమను ప్రకటించువాడు గాను కాక ఆ క్రీస్తు ప్రేమను క్రియలలో చూపించెను. 1890 అక్టోబర్ 4వ తేదీన సేవలో సహకారిగా ఉన్న తన భార్య మరణించినప్పటికీ ప్రభువు సేవలో కొనసాగుటకు నిశ్చయించుకునెను. విలియం బూత్ తన వృద్ధాప్యంలో 1904 నుండి 1907 వరకు ఇంచుమించు 5000 మైళ్ళు ప్రయాణం చేసి 400 మీటింగ్స్ లో ప్రసంగించారు. అంతమువరకు ప్రభువు కొరకు జీవించెను. చివరిగా విలియం బూత్ తన 53 సంవత్సరాల వయసులో 1915 ఆగస్టు 20వ తేదీన తాను ప్రేమించిన ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఇంచుమించు 60 వేల మంది ఆయన భూస్థాపన కార్యక్రమమునకు హాజరైరి.

గొప్పపలుకు:- ప్రజలకు సువార్తను ప్రకటించుటయె కాక వారి శరీర అవసరాలను, ఆకలి బాధలు కూడా తీర్చుట అవసరమే.

541 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account