April 1 2025
📖 ఏప్రిల్ 1, 2025
దేవుని వాగ్దానం:
“నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును.”
యిర్మియా 15:19
వివరణ & ప్రేరణ:
దేవుడు తన ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. మన జీవితాలలో ఎన్నో పరీక్షలు, శోకాలు ఎదురవుతాయి. మనం బలహీనమయ్యే సమయాల్లో దేవుడు మనకు నీతో వుంటాను అని హామీ ఇస్తున్నాడు. అంటే, మనం నష్టపోయే ప్రసక్తే లేదు, దేవుడు మనతో ఉన్నాడు!
మన జీవిత మార్గంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురవచ్చు, మన విశ్వాసం పరీక్షించబడవచ్చు. కానీ దేవుడు మనతో ఉంటానని చెప్పినప్పుడు, మనం భయపడనవసరం లేదు. ఆయన మనను నిలబెడతాడు. మన ఏ స్థితిలో వున్నా అయన మనలను తిరిగి ఆశిర్వాదములోనికి నడిపిస్తాడు , ఆయన వాగ్దానమును నమ్మి ముందుకు సాగుదాం. ఆయన కోసం నిలిచియుందాం.
ప్రార్థన:
ఓ ప్రేమగల తండ్రి దేవా,
నీ వాగ్దానం కోసం నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, నీవు నాతో ఉన్నావని తెలుసుకొని ధైర్యంగా ముందుకు సాగాలి. నా విశ్వాసం బలపడేలా నన్ను మార్గదర్శించు. నీవు నన్ను నడిపించు, నేను వెళ్ళువాడను, నీ కొరకు నిలిచి ఉంటాను. యేసునామంలో ప్రార్థిస్తున్నాను, ఆమేన్.
📖 April 1, 2025
Bible Promise:
“You shall not turn away, but you shall stand for Me.”
- Jeremiah 15:19
Explanation & Motivation:
God is always with His people. In our lives, we face many trials and challenges. In times of weakness, God assures us that we will not turn away. This means we will not be defeated because God is with us!
There may be ups and downs in our life journey, and our faith may be tested. But when God says He is with us, we have nothing to fear. He will make us stand firm. Let’s trust His promise and move forward. Stand for Him!
Prayer:
Loving Heavenly Father,
Thank You for Your promise. No matter what problems come in my life, help me to trust that You are with me. Strengthen my faith and guide me in Your ways. Lead me so that I will not turn away but stand firm for You. In Jesus’ name, I pray. Amen.