Proverbs – సామెతలు

జ్ఞానము అనునదే సామెతల యొక్క ముఖ్య భావార్థము. జీవితము చక్కగాను, చమత్కారముగాను జీవించుటకు సామర్థ్యమునిచ్చునది జ్ఞానమే. అనుదిన జీవితము యొక్క క్రియారూపకమైన సమస్యలను జయకరముగా ఎదుర్కొనుటకు విశాలమైన కర్తవ్యములు ఈ గ్రంథములో ఇమిడియున్నవి. దేవుడు తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులు, పొరుగువారు, అధికారులు మొదలైన వారితో ఏలాగు మెలగవలయును అని ఇది నేర్పించుచున్నది. జీవిత సమస్యలను ఎదుర్కొనుటకు అవసరమైన ఒక ఆత్మీయ దృష్టిని పాఠకులకు బహుకరించుటకు, కవిత్వము, విప్పుడు కథ, సామెతలు, ఉపమానములు, పొడుపు కథలు మొదలైవాటితో నిండిన ఒక అక్షరానుసారశైలిని దీని గ్రంథకర్తయైన సొలొమోను ఉపయోగించియున్నాడు.

ఉద్దేశము : సకల క్రియలలో, వివేకముగలవారుగాను, నిష్కలంకులుగా నుండుటకుగాను, జనులకు నేర్పించుటకుగాను, యువలకులకు వచ్చు సమస్యలు ఎలాగు అతిజీవించాలి అనుదానిని గూర్చిన నిర్దేశములు. జ్ఞానులకు యోగ్యమైన నాయకత్వ లక్షణములు నిచ్చుటకు సహాయపడుచుండెను. సంక్షిప్తముగా చెప్పినట్లైతే దైవ జ్ఞానం దయనందిన జీవితములోను ఉపయోగపరచుకొనుటకు సత్ మార్గ నిర్దేశములనిచ్చుటకుగాను యీ పుస్తకం రచించబడినది.

ముఖ్య గ్రంథకర్త ఇశ్రాయేలీయుల జ్ఞానులకు జ్ఞానియైన సొలొమోను కాబట్టి సొలొమోను సామెతలు అను నామము హెబ్రీ, గ్రీకు పరిశుద్ధ గ్రంథములు పెట్టుకొన్నవి. తరువాత లాటిన్ భాషలోను, ఇంగ్లీషులోను ఇతర భాషలలోను సామెతలు అని తగ్గించబడినది.

గ్రంథకర్త : సొలొమోను

కాలము : సొలొమోను పరిపాలన ప్రారంభములో వ్రాయబడింది. దాదాపుగా క్రీ.పూ 931 అని ఎంచబడుచున్నది. 25 – 29 అధ్యాయములు క్రీ.పూ 700 హిజ్కియా చేత సేకరించబడి చేర్చబడినవి.

ముఖ్యాంశము : పరిపూర్ణ జ్ఞానము గల ఆలోచనలతో దేవుని యందు భయభక్తులు గలిగి ఏలాగు జీవించాలి అని ప్రజలకు నేర్పించే చక్కటి వచనములతో నిండిన గ్రంథమిది.

గ్రంథ ప్రాముఖ్యత : కవిత్వము, చిన్న ఉపమానములు, ఉద్దేశముతో కూడిన ప్రశ్నలు.

ముఖ్య మాట : జ్ఞానము

ముఖ్య వచనములు : సామెతలు 1:5-7; సామెతలు 35:6.

ముఖ్య అధ్యాయము : సామెతలు 31 , ఈ అధ్యాయము పాత రచనలలో ప్రత్యేకమైన ఒక భాగము. దీనిలో స్త్రీలను గూర్చి ఉన్నతమైన, శ్రేష్టమైన ఒక దృష్టిని చూడవచ్చును. సామర్ధ్యము గల స్త్రీ, మాదిరికరమైన భార్య, శ్రేష్టమైన తల్లి, మంచి పొరుగు స్త్రీ అయిన స్థితులలో ఇక్కడ చిత్రించబడియున్న స్త్రీ 7వ అధ్యాయములోని జారస్త్రీ నుండి ఎంతగా ప్రత్యేకించబడుచున్నది.

గ్రంథ విభజన : క్రింది ఇవ్వబడియున్న రీతిగా ఆరు భాగములుగా ఈ గ్రంథమును విభజింపవచ్చు.

గ్రంథము యొక్క ఉద్దేశము Pro,1,1-1,7
యౌవనస్థులకు జ్ఞానోపదేశములు Pro,1,8-8,36
ప్రతి మానవునికి తగిన బోధనలు Pro,9,1-24,34
హిజ్కియా సేకరించిన సామెతలు అధ్యా 25 – 29
ఆగూరుపలికిన మాటలు 30వ అధ్యా
రాజైన లెమూయేలు పలికిన మాటలు 31వ అధ్యా

కొన్ని ముఖ్యాంశములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 20వ గ్రంథము; అధ్యాయములు 31; వచనములు 915; ప్రశ్నలు 49; నెరవేరని ప్రవచనాలు 27; పాపములు 67; మూడులను గూర్చినవి 66; సోమరితనములను గూర్చినవి 28; రాజులను గూర్చినవి 22; హేయమైనవి 25; ఆజ్ఞలు 215; వాగ్దానములు 120; ఆశీర్వాదములు 27; జీవిత రహస్యములు 24; మంచి క్రియలు 17; సామెతలు 560.

354 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account