

Ascharyakarudu
ఆశ్చర్యాకరుడా నా ఆలోచన కర్తవు
— Hosanna Ministriesఆశ్చర్యాకరుడా
నా ఆలోచన కర్తవు (2)
నిత్యుడగు తండ్రివి
నా షాలేము రాజువు (2)
సింహపు పిల్లలైనా
కొదువ కలిగి ఆకలిగొనినా (2)
నీ పిల్లలు – ఆకలితో అలమటింతురా
నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా||
విత్తని పక్షులను
నిత్యము పోషించుచున్నావు (2)
నీ పిల్లలు – వాటికంటే శ్రేష్టులే కదా
నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా||
చీకటి తొలగే
నీతి సూర్యుడు నాలో ఉదయించె (2)
నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను
నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా||
Aascharyakarudaa Naa Aalochanakarthavu
— Hosanna MinistriesAascharyakarudaa
Naa Aalochanakarthavu (2)
Nithyudagu Thandrivi
Naa Shaalemu Raajuvu (2)
Simhapu Pillalainaa
Koduva Kaligi Aakaligoninaa (2)
Nee Pillalu – Aakalitho Alamatinthuraa
Neevunnantha Varaku (2) ||Aascharyakarudaa||
Vitthani Pakshulanu
Nithyamu Poshinchuchunnaavu (2)
Nee Pillalu – Vaatikante Shreshtule Kadaa
Neevunnantha Varaku (2) ||Aascharyakarudaa||
Cheekati Tholage
Neethi Sooryudu Naalo Udayinche (2)
Ne Saakshigaa – Velugumayamai Thejarilledanu
Neevunnantha Varaku (2) ||Aascharyakarudaa||
యేసు అను నామమే
— Hosanna Ministriesయేసు అను నామమే – నా మధుర గానమే -2
నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే….
నా అడుగులు జార సిద్ధమాయెను -2
అంతలోన నా ప్రియుడు -2
నన్ను కౌగలించెను -1
యేసు అను నామమే – నా మధుర గానమే
నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే….
అగాధజలములలోన – అలమటించు వేళ -2
జాలి వీడి విడువక -2
నన్ను ఆదరించెను -1
యేసు అను నామమే – నా మధుర గానమే -2
నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే….
అడవి చెట్లలోన – జల్దరు వృక్షంబు వలె -2
పురుషులలో నా ప్రియుడు -2
అధిక కాంక్షనీయుడు -1
యేసు అను నామమే – నా మధుర గానమే -2
నా హృదయ ధ్యానమే -1 యేసు అను నామమే….
Yesu Anu Namame
— Hosanna Ministriesహల్లెలూయా -యేసయ్యా
— Hosanna Ministriesహల్లెలూయా -యేసయ్యా -2
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
హల్లెలూయా -యేసయ్యా -2
యెహోషువా ప్రార్థించగా – సూర్య చంద్రులను నిలిపావు -3
దానియేలు ప్రార్థించగా – సింహపు నోళ్లను మూసావు -1
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
హల్లెలూయా -యేసయ్యా -2
మోషే ప్రార్థించగా – మన్నాను కురిపించావు -3
ఏలియా ప్రార్థించగా – వర్షమును కురిపించితివి -1
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
హల్లెలూయా -యేసయ్యా -2
పౌలుసీలలు స్తుతించగా – చెరసాల పునాదులు కదిలించావు -3
ఇశ్రాయేలు స్తుతించగా – యెరికో గోడలు కూల్చావు -1
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
హల్లెలూయా -యేసయ్యా -2
Halleluya Yesayya Mahima
— Hosanna Ministriesదేవా నా దేవుడవు నీవే
— Hosanna Ministriesదేవా………….. నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును -2
నీ బలమును – ప్రభావమును చూడ
నేనెంతో ఆశతో ఉన్నాను
దేవా………….. నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును
నీరు లేని దేశమందు – దప్పిగొన్నది నా ప్రాణం -2
నీ మీద ఆశచేత – సొమ్మసిల్లెను నా శరీరం -2
దేవా నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును
ఉత్సహించు పెదవులతో – నా నోరు చేసేను గానం -2
నీ రెక్కల చాటునా – శరణన్నది నా ప్రాణం -2
దేవా నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును -2
నీ బలమును – ప్రభావమును చూడ
నేనెంతో ఆశతో ఉన్నాను
దేవా నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును
Devaa Naa Devudavu Neeve
— Hosanna Ministriesఆనందమే ప్రభు యేసుని స్తుతించుట
— Hosanna Ministriesఆనందమే ప్రభు యేసుని స్తుతించుట
ఆత్మానంద గీతముల్ పాడెద.
సిలువలో నాకై రక్తము కార్చెను
సింహాసనమునకై నన్నును పిలిచెను
సింహపుకోరల నుండి నన్ను విడిపించెను
విశ్వాసమును కాపాడుకొనుచూ
విజయుడైన యేసుని ముఖమును చూచుచూ
విలువైన కిరీటము పొందెద నిశ్చయము
నా మానస వీణను మ్రోగించగా
నా మనో నేత్రములందు కనిపించె ప్రభు రూపమే
నా మదిలోన మెదిలేను ప్రభు సప్తస్వరాలు
Anandame Prabhu Yesuni
— Hosanna Ministriesప్రేమమయా యేసు ప్రభువా
— Hosanna Ministriesప్రేమమయా యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును ప్రభువా -2
అనుదినమూ – అనుక్షణము -2
నిన్నే స్తుతింతును ప్రభువా -2
ప్రేమమయా యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును ప్రభువా
ఏ యోగ్యత లేని నన్ను
నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా -2
నన్నెంతగానో ప్రేమించినావు -2
నీ ప్రాణమిచ్చావు నాకై -2
ప్రేమమయా యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును ప్రభువా || ప్రేమమయా ||
ఎదవాకిటను నీవు నిలచి
నా హృదయాన్ని తట్టావు ప్రభువా -2
హౄదయాంగణములోకి అరుదెంచినావు -2
నాకెంతో ఆనందమే -2
ప్రేమమయా యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును ప్రభువా || ప్రేమమయా ||
శోధనలు నను చుట్టుకొనినా
ఆవేదనలు నను అలుముకొనినా -2
శోధన, రోదన ఆవేదనలో -2
నిన్నే స్తుతింతును ప్రభువా -2 || ప్రేమమయా ||
Premamaya Yesu Prabhuva
— Hosanna Ministriesఆనందం యేసుతో ఆనందం
— Hosanna Ministriesఆనందం యేసుతో ఆనందం
జయగంభీర ధ్వనితో పాడెదను
జయరాజాధిరాజుతో సాగెదను ||ఆనందం||
నా ప్రాణమునకు సేదదీర్చి
తన నామము బట్టి నీటి మార్గమున నన్ను నడిపించెను
ఏ అపాయమునకు నేను భయపడకుందును ||ఆనందం||
నా ప్రభుని కృప చూచిన
నాటినుండి నన్ను నేనే మరచిపోతినే
నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచెదనా ||ఆనందం||
సిలువను యేసు సహించెను
తన యెదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంఘముకై
అవమానము నొందె – నాకై మరణము గెలిచె ||ఆనందం||
Anandham Yesutho Anandham
— Hosanna Ministriesనా వేదనలో వెదకితిని
— Hosanna Ministriesనా వేదనలో వెదకితిని – శ్రీయేసుని పాదాలను
నా మనస్సులో కోరితిని – నీ రూపమునే దీనుడనై “నావేదన”
వేకు జాములో విలపించితిని – నా పాపములో వ్యసనములో
ఓదార్చుము విసుగొందక – నీ కృపలో నా ప్రభువా – 2 “నావేదన”
నీ హస్తములో నిదురింపజేయుమా – నీ ప్రేమలో లాలించుమా
ఓదార్చుము విసుగొందక – నీ కృపలో నా ప్రభువా – 2 “నావేదన”