

Dayakshetram
Jagamerigina RajuYesanna
జయ సంకేతమా
— Hosanna Ministriesపల్లవి.
జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్య_2
అపురూపము నీ ప్రతి తలుపు
అలరించిన ఆత్మీయ గెలుపు _2
నడిపించే నీ ప్రేమ పిలుపు
//జయ సంకేతమా//
1.
నీ ప్రేమ నాలో ఉదయించగా
నా కొరకు స్వరము సమకూర్చేనే_2
నన్నెల ప్రేమించ మనసాయెను
నీ మనసెంతో మహోన్నతము
కొంతైనా నీ రుణము తీర్చేదెలా నీవు లేక క్షణమైన బ్రతికేదెలా
విరిగి నలిగిన మనసుతో నిన్నే
సేవించేద నా యజమానుడా-(2)
జయ సంకేతమా
2.
నిలిచెను నా మదిలో నీ వాక్యమే నాలోన రూపించే నీ రూపమే_2
దీపము నాలో వెలిగించగా నా ఆత్మ దీపము వెలిగించగా
రగిలించే నాలో స్తుతి జ్వాలలు
భజియించి నిన్నే కీర్తింతును
జీవితగమనం స్థాపించితివి
సీయోను చేర నడిపించుమా_(2) జయ సంకేతమా
3.
నీ కృప నాయెడల విస్తారమే
ఏనాడు తలవని భాగ్యమిది_2
నీ కృప నాకు తోడుండగా
నీ సన్నిధియే నాకు నీడాయెను
ఘనమైన కార్యములు నీవు చేయగా
కొదువేమి లేదాయె నాకెన్నడు
ఆత్మబలముతో నన్ను నడిపించే నా గొప్ప దేవుడవు నీవేనయ్యా
బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా
(జయ సంకేతమా)
Jaya Sankethama
— Hosanna Ministriesజగములనేలే పరిపాలక
— Hosanna Ministriesజగములనేలే పరిపాలక
జగతికి నీవే ఆధారమా
ఆత్మతో మనసుతో స్తోత్ర గానము పాడెద నిరతము ప్రేమగీతము
యేసయ్య యేసయ్య నీ కృపా చాలయ్యా
యేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య
//జగమునేలే పరిపాలక//
1.మహారాజుగా నా తోడువై
నిలిచావు ప్రతి స్థలమున
నా భారము నీవు మోయగా
సులువాయే నా పయనము
నీ దయచేతనే కలిగిన క్షేమము
ఎన్నడు నను విడదే_2
నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే_2
_యేసయ్య యేసయ్య నీ కృపా-
2.సుకుమారుడా నీ చరితము
నేనెంత వివరింతును
నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను
ఘనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా_(2)
జీవితమంతా నీకర్పించి
నీ రుణము నే తీర్చనా_(2)
//యేసయ్యా యేసయ్యా నీ కృపా//
3.పరిశుద్ధుడా సారధివై
నడిపించు సీయోనుకే
నా యాత్రలో నే దాటిన
ప్రతి మలుపు నీ చిత్తమే
నా విశ్వాసము నీ పైనుంచి
విజయము నే చాటనా_(2)
నా ప్రతిక్షణము ఈ భావనతో
గురి యొద్దకే సాగెదా_(2)
(యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్య)
Jagamulanele Paripalaka
— Hosanna Ministriesఅక్షయుడా నా ప్రియ యేసయ్యా
— Hosanna Ministriesపల్లవి :
అక్షయుడా నా ప్రియ యేసయ్యా
నీకే నా అభివందనం} [2]
{నీవు నా కోసమే తిరిగి వస్తావని
నేను నీ సొంతమై కలిసి పోదామని
యుగయుగములు నన్నేలు తావని
నీకే నా ఘన స్వాగతం} [1]
|అక్షయుడా|
చరణం :1️⃣
{నీ బలిపీఠ మందు పక్షులకు
వాసమే దొరికెనే…
అది అపురూపమైన నీ దర్శనం
కలిగి జీవించు నే…
నేనే మందును ఆకాంక్షితును
నీతో ఉండాలని కల నెరవేరునా
నా ప్రియుడా యేసయ్యా…
చిరకాల ఆశను నెరవేర్చు తావని
మదిలో చిరు కోరికా} [1]
|అక్షయుడా|
చరణం :2️⃣
{నీ అరచేతిలో నన్ను చెక్కుకొని
మరువలేదంటివే…
నీ కనుపాపగా నన్ను కాచుకొని
దాచుకుంటావులే…
నన్ను రక్షించిన ప్రాణమర్పించిన
నన్ను స్నేహించిన నన్ను ముద్రించిన
నా ప్రియుడా యేసయ్యా…
పానార్పణముగా నా జీవితమును అర్పించుకున్నానయా} [1]
|అక్షయుడా|
చరణం :3️⃣
{నీవు స్థాపించిన ఏ రాజ్యమైన
కొదవ లేకుండెనే…
బహు విస్తారమైన నీ కృపయే
మేలుతో నింపునే…
అది స్థిరమైనదై క్షేమము నొందనే
నీ మహిమాత్మతో నెమ్మది పొందెనే
నా ప్రియుడా యేసయ్యా…
రాజ్యాలనేలే శకపురుషుడా నీకు సాటెవ్వరు} [1]
|అక్షయుడా|
Akshayuda Naa Priya Yesayya
— Hosanna Ministriesఆశ్రయుడా నా యేసయ్య
— Hosanna Ministriesఆశ్రయుడా నా యేసయ్య
స్తుతి మహిమా ప్రభావము నీకేనయ్యా_(2)
విశ్వవిజేతవు_సత్యవిధాతవు
నిత్య మహిమకు_ఆధారము నీవు_(2)
లోకసాగరాన కృంగినవేళ
నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి
నను చేరదీసిన నిర్మలుడా
నీకేనయ్యా ఆరాధన
నీకేనయ్యా స్తుతి ఆరాధన_(2)
-ఆశ్రయుడా యేసయ్య
1.
తెల్లని వెన్నెలకాంతివి నీవు
చల్లని మమతల మనసే నీవు-(2)
కరుణని చూపి కలషము బాపి
నన్ను ప్రేమించిన ప్రేమవు నీవు-(2)
జనులకు దైవం జగతికి దీపం నీవు గాక ఎవరున్నారు
నీవే నీవే ఈ సృష్టిలో
కొనియాడబడుచున్న మహారాజవు-(2)
(ఆశ్రయుడా)
2.
జీవితదినములు అధికములగునని వాగ్దానము చేసి దీవించితివి_(2)
ఆపత్కాలమున అండగనిలిచి
ఆశల జాడలు చూపించితివి_(2)
శ్రీమంతుడవై సిరికే రాజువై
వ్యధలను బాపి నా స్థితి మార్చితివి
అనురాగమే నీ ఐశ్వర్యమా
సాత్వికమే నీ సౌందర్యమా_(2)
ఆశ్రయుడా నా యేసయ్య
3.
నీ చిత్తముకై అరుణోదయమున
అర్పించెదను నా స్తుతి అర్పణ-(2)
పరిశుద్ధులలో నీ స్వాస్థ్యముయొక్క
మహిమైశ్వర్యము నేపొందుటకు _(2)
ప్రతి విషయములలో స్తుతి చెల్లించుచు పరిశుద్ధాత్మలో
ప్రార్థించేదను
పరిశుద్ధుడా పరిపూర్ణుడా
నీ చిత్తమే నాలో నెరవేర్చుమా_(2) _ఆశ్రయుడా నా యేసయ్య-
Ashrayuda Naa Yesayya
— Hosanna Ministriesకురిసింది తొలకరి వాన
— Hosanna Ministriesపల్లవి :👨🎤👩🎤
{కురిసింది తొలకరి వాన నా గుండెలోన} [2]
{చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై} [2]
{నీ నిత్య కృపయే వాత్సల్యమై
నీ దయయే హెర్మోను మంచువలే} [2]
{పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన
ఆనందించి ఆరాధించెద నా యేసయ్య} [2]
|కురిసింది|
చరణం :1️⃣
{దూలినై పాడైన ఎడారిగా నను చేయక
జీవజల ఊటలు ప్రవహింపజేశావు} [2]
{కలతల కన్నీళ్లలో కనుమరుగైపోనీయక
సాక్షి మేఘమై నిరీక్షణగా నిలిచావు} [2]
{స్తుతులు స్తోత్రం నీకేనయ్యా దయాసాగరా} [2]
|పొంగిపొరలి|
చరణం :2️⃣
{నీ మందిర గుమ్మములోని ఊటలతో శుద్ధి చేసి
నా చీల మండలమునకు సౌందర్యమిచ్చితివి} [2]
{నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కోల్పోనీయక
నీ ప్రభావ మేఘముతో సాక్షిగ నను నడిపితివి} [2]
{తడిసి మునిగి తేలెదనయ్యా ప్రేమ సాగరా} [2]
|పొంగిపొరలి|
చరణం :2️⃣
{నా తొలకరి వర్షము నీవై చిగురింపజేసావు
నా ఆశల ఊహలలో విహరింపజేశావు} [2]
{నా కడవరి వర్షము నీవై ఫలింపజేసావు
నీ మహిమ మేఘములో నన్ను కొనిపోయెదవు} [2]
{హర్షధ్వనులతో హర్షించెదను కరుణా సాగర} [2]
|పొంగిపొరలి|
Kurisindhi Tolakari Vaana
— Hosanna Ministriesఊహకందని ప్రేమలోన
— Hosanna Ministriesఊహకందని ప్రేమలోన భావమే నీవు..
హృదయమందు పరవసించుగానమే నీవు..
మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు..
మరపురాని కలల సౌధం గురుతులేనీవు..
ఎడబాయలేనన్నానిజ స్నేహమేనీవు..
నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు.. “ఊహకందని ప్రేమ”
తల్లడిల్లే తల్లి కన్నా మించిప్రేమించి
తనువు తీరే వరకు నన్ను విడువలేనంది..”2″
అదియే..ఆ ఆ ఆ నే గాయపరచిన వేళలో కన్నీరు కార్చిన ప్రేమగా
నులివెచ్చనైన ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయే
నీ గుండెలో నను చేర్చిన నీ అమరమైన ప్రేమయే..”2″ “ఊహకందని ప్రేమ”
నింగి నేలను కలిపిన బలమైన వారధిగా
నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా..”2″
అదియే..ఆ ఆ ఆ తన మహిమ విడిచిన త్యాగము ఈ భువికి వచ్చిన భాగ్యము
నను దాటిపోక వెదకిన నీ మధురమైన ప్రేమయే
నీ సర్వమిచ్చిన దాతవు నను హత్తుకున్న స్వామివి..”2″ “ఊహకందని ప్రేమ”
దేహమందు గాయమైతే కుదుట పడును కదా
గుండె గాయము గుర్తుపట్టిన నరుడు లేడుకదా.. “2”
నీవే నీవే యేసయ్య నా అంతరంగము తరచి చూసిన గాఢమైన ప్రేమవు..
ననుభుజముపైన మోసిన అలసిపోని ప్రేమవు
నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనే లేదయ్యా ..”2″ “ఊహకందని ప్రేమ”
Oohakandani Prema
— Hosanna Ministriesయేసయ్యే నా ప్రాణం
— Hosanna Ministriesయేసయ్యే – నా ప్రాణం
పల్లవి :- యేసయ్య నా ప్రాణమా – ఘనమైన స్తుతిగానమా – 2
అద్భుతమైన నీ ఆదరణే – ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగ వెంటాడెను – నే అలయక నడిపించెను
నా జీవమా – నా స్తోత్రమా – నీకే ఆరాధన
నా స్నేహము – సంక్షేమము – నీవే ఆరాద్యుడా
1 : చిరకాలము నాతో ఉంటానని – క్షణమైనా వీడిపోలేదని
నీలో నను చేర్చుకున్నావని – తండ్రితో ఏకమై ఉన్నామని
ఆనందగానము నే పాడనా – 2
ఏదైనా నాకున్న సంతోషము – నీతోనే కలిగున్న అనుబంధమే -2
సృజనాత్మకమైన నీకృప చాలు- నే బ్రతికున్నది నీకోసమే -2
2 : జీవజలముగా నిలిచావని – జలనిధిగా నాలోఉన్నావని
జనులకు దీవెనగామార్చావని – జగతిలో సాక్షిగాఉంచావని
ఉత్సాహగానము నే పాడనా – 2
ఏదైనా నీకొరకు చేసేందుకు – ఇచ్చితివి బలమైన నీశక్తిని -2|| యేసయ్య ||
ఇదియేచాలును నా జీవితాంతము – ఇల నాకన్నియు నీవేకదా – 2 ॥ యేసయ్య|
3 : మధురముకాదా నీనామధ్యానం – మరుపురానిది నీ ప్రేమమధురం
మేలుచేయుచు ననునడుపువైనం – క్షేమముగా నా ఈలోకపయనం
స్తోత్రగీతముగా నేపాడనా -2
నిజమైన అనురాగం చూపావయ్యా – స్థిరమైన అనుబంధం నీదేనయ్యా -2
స్తుతుల సింహాసనం నీకొరకేగా – ఆసీనుడవై ననుపాలించవా – 2
స్తుతిపాత్రుడా – స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆనందమే పరమానందమే – నీలో నా యేసయ్య ||యేసయ్య ||