

Mahimaanvithuda
అల్ఫా ఒమేగయైన
— Hosanna Ministriesఅల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా (2)
రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమా
ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా
నాతో స్నేహమై నా సౌఖ్యమై
నను నడిపించే నా యేసయ్యా (2) ||అల్ఫా||
కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమే
ఉన్నతముగా నిను ఆరాధించుటకు
అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి
నూతన వసంతములు చేర్చెను (2)
జీవించెద నీ కొరకే
హర్షించెద నీలోనే (2) ||అల్ఫా||
తేజోమయుడా – నీ దివ్య సంకల్పమే
ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు
ఆశ నిరాశల వలయాలు తప్పించి
అగ్ని జ్వాలగా నను చేసెను (2)
నా స్తుతి కీర్తన నీవే
స్తుతి ఆరాధన నీకే (2) ||అల్ఫా||
నిజస్నేహితుడా – నీ స్నేహ మాధుర్యమే
శుభ సూచనగా నను నిలుపుటకు
అంతులేని అగాధాలు దాటించి
అందని శిఖరాలు ఎక్కించెను (2)
నా చెలిమి నీతోనే
నా కలిమి నీలోనే (2) ||అల్ఫా||
Alphaa Omegayaina
— Hosanna MinistriesAlphaa Omegayaina – Mahimaanvithudaa
Advitheeya Sathyavanthudaa – Nirantharam Sthothraarhudaa (2)
Raathrilo Kaanthi Kiranamaa – Pagatilo Krupaa Nilayamaa
Mudimi Varaku Nannaadarinche Sathya Vaakyamaa
Naatho Snehamai Naa Soukhyamai
Nanu Nadipinche Naa Yesayyaa (2) ||Alphaa||
Kanikara Poornudaa – Nee Krupa Baahulyame
Unnathamuga Ninu Aaraadhinchutaku
Anukshanamuna Nee Mukha Kaanthilo Nilipi
Noothana Vasanthamulu Cherchenu (2)
Jeevincheda Nee Korake
Harshincheda Neelone (2) ||Alphaa||
Thejomayudaa – Nee Divya Sankalpame
Aascharyakaramaina Velugulo Naduputaku
Aasha Niraashala Valayaalu Thappinchi
Agni Jwaalagaa Nanu Chesenu (2)
Naa Sthuthi Keerthana Neeve
Sthuthi Aaraadhana Neeke (2) ||Alphaa||
Nija Snehithudaa – Nee Sneha Maadhuryame
Shubha Soochanagaa Nanu Niluputaku
Anthuleni Agaadhaalu Daatinchi
Andani Shikharaalu Ekkinchenu (2)
Naa Chelimi Neethone
Naa Kalimi Neelone (2) ||Alphaa||
మహిమ స్వరూపుడా
— Hosanna Ministriesమహిమ స్వరూపుడా మృత్యుంజయుడా
మరణపుముల్లును విరిచినవాడా
నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములునీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు
నీ రక్తమును నా రక్షణకై
బలియాగముగా అర్పించినావు
నీ గాయములద్వారా స్వస్థతనొంది
అనందించెద నీలో నేను!!మహిమ స్వరూపుడా!!
విరిగిన మనస్సు నలిగినా హృదయం
నీ కిష్టమైన బలియాగముగా
నీ చేతితోనే విరిచిన రోట్టెనై
ఆహారమౌదును అనేకులకు!!మహిమ స్వరూపుడా!!
పరిశుద్ధత్మ ఫలముపొంది
పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై
సీయోను రాజా నీ ముఖము చూడ
ఆశతో నేను వేచియున్నాను !!మహిమ స్వరూపుడా!!
Mahima Swarupudaa Mruthyumjayuda
— Hosanna Ministriesదయగల హృదయుడవు
— Hosanna Ministriesదయగల హృదయుడవు నీ స్వాస్థ $మును ఎన్నడు ఎడబాయవు
ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవలు ఏర్పరచువాడవు
సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును
సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవమార్గము
సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము
శ్రేష్టమైన ఉపదేశముతో – జీవము గలిగిన సంఘములో
నింపుచున్నావు దీవెనలతో నను – నడుపుచున్నావు సమృద్ధితో
పరిశుద్దుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము
పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము
విస్వాసమందు నిలకడగా – నీ రాకడ వరకు మెలకువగా
విసుగక నిత్యము ప్రార్ధింతును – నిను నిశ్చలమైన నిరీక్షణతో
పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము
పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము
ఆశ్రయమైనది నీ నామమే – సజీవమైనది నీ త్యాగమే
ఆరాధింతును నా యేసయ్యా – నిత్యము కీర్తించి ఘనపరతును
Dayagala Hrudayudavu
— Hosanna Ministriesసృష్టికర్తవైన యెహోవా
సృష్టికర్తవైన యెహోవా
నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ
మంటికి రూపమిచ్చినావు
మహిమలో స్థానమిచ్చినావు
నాలో నిన్ను చూసావు
నీలో నన్ను దాచావు
నిస్స్వార్ధ్యమైన నీ ప్రేమా
మరణము కంటె బలమైనది నీ ప్రేమ ||సృష్టికర్తవైన||
ఏ కాంతి లేని నిశీధిలో
ఏ తోడు లేని విషాదపు వీధులలో
ఎన్నో అపాయపు అంచులలో
నన్నాదుకున్న నా కన్న తండ్రివి (2)
యేసయ్యా నను అనాథగా విడువక
నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2) ||సృష్టికర్తవైన||
నిస్సారమైన నా జీవితములో
నిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగా
నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి
నన్నాకర్షించిన ప్రేమమూర్తివి (2)
యేసయ్యా నను కృపతో బలపరచి
ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి (2) ||సృష్టికర్తవైన||
Srushtikarthavaina Yehovaa
Srushtikarthavaina Yehovaa
Nee Chethipaniyaina Naapai Endukintha Prema
Mantiki Roopamichchinaavu
Mahimalo Sthaanamichchinaavu
Naalo Ninnu Choosaavu
Neelo Nannu Daachaavu
Nisswaardhyamaina Nee Premaa
Maranamu Kante Balamainadi Nee Prema ||Srushtikarthavaina||
Ae Kaanthi Leni Nisheedhilo
Aer Thodu Leni Vishaadapu Veedhulalo
Enno Apaayapu Anchulalo
Nannaadukunna Naa Kanna Thandrivi (2)
Yesayyaa Nanu Anaathagaa Viduvaka
Neelaanjanamulatho Naaku Punaadulu Vesithivi (2) ||Srushtikarthavaina||
Nissaaramaina Naa Jeevithamulo
Nittoorpule Nannu Dinamella Vedhinchagaa
Nashinchipothunna Nannu Vedaki Vachchi
Nannaakarshinchina Premamoorthivi (2)
Yesayyaa Nanu Krupatho Balaparachi
Ullaasa Vasthramunu Naaku Dharimpajesithivi (2) ||Srushtikarthavaina||
వేల్పులలో బహుఘనుడా
— Hosanna Ministriesప|| వేల్పులలో బహుఘనుడా – యేసయ్యా
నిను సేవించు వారిని – ఘనపరతువు
నిను ప్రేమించు వారికి సమస్తము – సమకూల్లి జరిగింతువు
నీయందు భయఖభక్తి గల వారికి. శాశ్వత కృప నిచ్చెదవు
సుందరుడైన యోసేపును – అంధకార బందువర్గాలలో
పవిత్రునిగ నిలిపావు – ఫలించెడి కొమ్మగ చేసావు
మెరుగుపెట్టి నను దాచావు – నీ అమ్ముల పొదిలో
ఘనవిజయము నిచ్చుటకొరకే – తగిన సమయములో
ఉత్తముడైన దావీదును – ఇరుకులేని విశాల స్థలములో
ఉన్నత కృపతో నింపావు – ఊహించని స్థితిలో నిలిపావు
విలువపెట్టి నను కొన్నావు – నీ అమూల్యమైన రక్తముతో
నిత్య జీవమునిచ్చుట కొరకు – మహిమ రాజ్యములో
పామరుడైన సీమోనును – కొలతలేని ఆత్మాభిషేకముతో
అజ్ఞానము తొలగించావు – విజ్ఞాన సంపదనిచ్చావు
పేరుపెట్టి నను పిలిచావు – నిను పోలినడచుటకు
చెప్ప శక్యముకాని ప్రహర్నముతో – నిను స్తుతించెదను
Velpulalo Bahu Ghanuda
— Hosanna Ministriesజీవించుచున్నది నేను కాదు
ప॥| జీవించుచున్నది నేను కాదు
క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను
క్రీస్తే నాలో జీవించుచున్నాడు
నేనునా సొత్తు కానే కాను
క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను
నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు
యేసయ్యా చిత్తమేనాలో నెరవేరుచున్నది
యుద్ధము నాది కానేకాదు
యుద్ధము యేసయ్యదే నా పక్షమున
జయమసలే నాది కానే కాదు
యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు
లోకమునాది కానేకాదు
యాత్రికుడను పరదేశిని
నాకు నివాసము లేనేలేదు
యేసయ్య నివాసము నాకిచ్చినాడు
Jeevinchuchunnadi Nenu Kadu
నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా
నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా
నిత్య జీవార్థమైనవి నీ శాసనములు (2)
వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా
నీ ప్రియమైన స్వాస్థ్యమును
రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను
నీ రాజ్య దండముతో ||నీతి||
ప్రతి వాగ్ధానము నా కొరకేనని
ప్రతి స్థలమందు – నా తోడై కాపాడుచున్నావు నీవు (2)
నిత్యమైన కృపతో నను బలపరచి
ఘనతను దీర్గాయువును దయచేయువాడవు (2) ||నీతి||
పరిమళ వాసనగ నేనుండుటకు
పరిశుద్ధ తైలముతో – నన్నభిషేకించి యున్నావు నీవు (2)
ప్రగతి పథములో నను నడిపించి
ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు (2) ||నీతి||
నిత్య సీయోనులో నీతో నిలుచుటకు
నిత్య నిబంధనను – నాతో స్థిరపరచుచున్నావు నీవు (2)
మహిమ కలిగిన పాత్రగ ఉండుటకు
ప్రజ్ఞ వివేకములతో నను నింపువాడవు (2) ||నీతి||
Neethi Nyaayamulu Jariginchu Naa Yesayyaa
Neethi Nyaayamulu Jariginchu Naa Yesayyaa
Nithya Jeevardhamainavi Nee Shaasanamulu (2)
Vruddhi Chesithivi Parishuddha Janamugaa
Nee Priyamaina Swaasthyamunu
Raddu Chesithivi Prathivaadi Thanthramulanu
Nee Raajya Dandamutho ||Neethi||
Prathi vaagdhaanamu Naa Korakenani
Prathi Sthalamandu – Naa Thodai Kaapaaduchunnaavu Neevu (2)
Nithyamaina Krupatho Nanu Balaparachi
Ghanathanu Deerghaayuvunu Dayacheyuvaadavu (2) ||Neethi||
Parimala Vaasanaga Nenundutaku
Parishuddha Thailamutho – Nannabhishekinchi Yunnaavu Neevu (2)
Pragathi Pathamulo Nanu Nadipinchi
Prakhyaathini Manchi Perunu Kaliginchuvaadavu (2) ||Neethi||
Nithya Seeyonulo Neetho Niluchutaku
Nithya Nibandhananu – Naatho Sthiraparchuchunnaavu Neevu (2)
Mahima Kaligina Paathraga Undutaku
Pragna Vivekamulatho Nanu Nimpuvaadavu (2) ||Neethi||














