

Mahimaswaroopudu
మహిమ స్వరూపుడా
— Hosanna Ministriesమహిమ స్వరూపుడా మృత్యుంజయుడా
మరణపుముల్లును విరిచినవాడా
నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములునీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు
నీ రక్తమును నా రక్షణకై
బలియాగముగా అర్పించినావు
నీ గాయములద్వారా స్వస్థతనొంది
అనందించెద నీలో నేను!!మహిమ స్వరూపుడా!!
విరిగిన మనస్సు నలిగినా హృదయం
నీ కిష్టమైన బలియాగముగా
నీ చేతితోనే విరిచిన రోట్టెనై
ఆహారమౌదును అనేకులకు!!మహిమ స్వరూపుడా!!
పరిశుద్ధత్మ ఫలముపొంది
పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై
సీయోను రాజా నీ ముఖము చూడ
ఆశతో నేను వేచియున్నాను !!మహిమ స్వరూపుడా!!
Mahima Swarupudaa Mruthyumjayuda
— Hosanna Ministriesకృపానిధి నీవే ప్రభు
— Hosanna Ministriesకృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు – 2
నీ కృపలో నన్ను నిలుపుము – 2
నీ కృపతోనే నను నింపుము -2 ౹౹కృపా౹౹
నీ కృప ఎంతో మహోన్నతము
ఆకాశము కంటే ఎత్తైయినది – 2
నీ సత్యం అత్యున్నతము
మేఘములంత ఎత్తున్నది – 2 ౹౹కృపా౹౹
నీ కృప జీవముకంటే ఉత్తమము
నీ కృప లేనిదే బ్రతుకలెను – 2
నీ కృపా బాహుళ్యంమే నను
నీలో నివసింప చేసినది – 2౹౹కృపా౹౹
నీ కృపలను నిత్యము తలచి
నీ సత్యములో జీవింతును -2
నీ కృపాతిశయములనే
నిత్యము నేను కీర్తింతును -2 ౹౹కృపా౹౹
ఈ లోకము ఆశాశ్వతము
నీదు కృపయే నిరంతరము -2
లోకమంతా దూషించినా
నీ కృప నాకంటే చాలు -2. …౹౹కృపా౹౹
Krupanidhi Neeve Prabhu
— Hosanna Ministriesపోరాటం ఆత్మీయ పోరాటం
పోరాటం ఆత్మీయ పోరాటం (2)
చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదు
సాగిపోవుచున్నాను
సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి (2)
నా యేసుతో కలిసి పోరాడుచున్నాను
అపజయమే ఎరుగని జయశీలుడాయన (2)
నా యేసు కొరకే సమర్పించుకున్నాను (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం||
నా యేసు వెళ్ళిన మార్గము లేనని
అవమానములైనా ఆవేదనలైనా (2)
నా యేసు కృపనుండి దూరపరచలేవని (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం||
ఆదియు అంతము లేనివాడు నా యేసు
ఆసీనుడయ్యాడు సింహాసనమందు (2)
ఆ సింహాసనం నా గమ్యస్థానం (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం||
Poraatam Aathmeeya Poraatam
Poraatam Aathmeeya Poraatam (2)
Chivari Shwaasa Varaku – Ee Poraatam Aagadu
Saagipovuchunnaanu
Siluvanu Mosukoni Naa Gamya Sthaanaaniki (2)
Naa Yesutho Kalisi Poraaduchunnaanu
Apajayame Erugani Jayasheeludaayana (2)
Naa Yesu Korake Samarpinchukunnaanu (2)
Aagiponu Nenu Saagipovuchunnaanu ||Poraatam||
Naa Yesu Vellina Maargamu Lenani
Avamaanamulainaa Aavedanalainaa (2)
Naa Yesu Krupanundi Dooraparachalevani (2)
Aagiponu Nenu Saagipovuchunnaanu ||Poraatam||
Aadiyu Anthamu Lenivaadu Naa Yesu
Aaseenudayyaadu Simhaasanamandu (2)
Aa Simhaasanam Naa Gamyasthaanam (2)
Aagiponu Nenu Saagipovuchunnaanu ||Poraatam||
నూతన యెరూషలేము పట్టణము
— Hosanna Ministriesనూతన – యెరూషలేము పట్టణము
పెండ్లికై- అలంకరింపబడుచున్నది
దైవనివాసము మనుషులతో- కూడా ఉన్నది
వారాయనకు – ప్రజలై యుందురు
ఆనంద – ఆనంద – ఆనందమే ౹౹నూతన౹౹
ఆదియు నేనే – అంతము నేనై యున్నాను
దుఃఖము లేదు – మరణము లేదు
ఆనంద – ఆనంద – ఆనందమే ౹౹నూతన౹౹
అసహ్యమైనది – నిషిద్ధమైనది చేయువారు
ఎవ్వరు దానిలో – లేనేలేరు
ఆనంద – ఆనంద – ఆనందమే ౹౹నూతన ౹౹
దేవుని దాసులు – ఆయనను సేవించుదురు
ముఖ దర్శనము – చేయుచునుందురు
ఆనంద – ఆనంద – ఆనందమే ౹౹ నూతన౹౹
సీయోనులో – గొర్రెపిల్లయే మూలరాయి
సీయోను పర్వతము – మీదయు ఆయనే
ఆనంద – ఆనంద – ఆనందమే ౹౹నూతన౹౹
Noothana Yerushalemu Pattanamu
— Hosanna Ministriesకృపయే నేటి వరకు కాచెను
— Hosanna Ministriesకృపయే నేటి వరకు కాచెను
నా కృప నిన్ను విడువ దనినా ౹౹కృప౹౹
మనోనేత్రములు వెలిగించినందున – యేసు పిలిచిన పిలుపును
క్రీస్తు మహిమేశ్వర్య మెట్టిదో- పరిశుద్ధులలో చూపితివే ౹౹కృపా ౹౹
జలములలో బడి వెళ్ళునపుడు – అలలవలె అవి పొంగి రాగా
అలల వలే నీ కృపతోడై – చేర్చెను నన్ను ఈ దరికి ౹౹కృపా ౹౹
భీకర రూపము దాల్చిన లోకము -మ్రింగుటకు నన్ను సమీపించగా
ఆశ్చర్యకరములు ఆదుకొని అందని కృపలో దాచెనుగా ౹౹కృపా౹౹
సేవార్థమైన వీణెలతో నేను – వీణెలు వాయించు వైణికులున్నా
సీయోను కొరకే జీవించుచూ- సీయోను రాజుతో హర్షించేదను ౹౹కృపా౹౹
నీదు వాక్యము – నా పాదములకు- నిత్యమైన వెలుగై యుండున్
నా కాలుజారె ననుకొనగా – నిలిపెను నన్ను నీ కృపయే ౹౹కృపా౹౹
Krupaye Netivaraku Kachenu
— Hosanna Ministriesనా ప్రియుడు యేసు నా ప్రియుడు యేసు
నా ప్రియుడు యేసు – నా ప్రియుడు యేసు
వ్రేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిల (2) ||నా ప్రియుడు||
మెల్లని చల్లని స్వరమే వినబడెను (2)
తండ్రీ వీరేమి చేయుచున్నారో (2)
ఎరుగరు గనుక క్షమించుమనెన్
ఆ ప్రియ స్వరమే నా ప్రభు స్వరమే ||నా ప్రియుడు||
అతని ప్రేమ మధురం మధురం
ఎన్నటికీ నే మరువలేను (2)
ధారబోసెను జీవం – నాకిచ్చె నిత్య జీవం
శాపమంతా బాపి నను దీవించెనుగా ||నా ప్రియుడు||
వీపంతా దున్నబడె నాగలితో
కారె రక్త వరదల్ కనుమా (2)
యేసు రక్తంలో రక్షణ – యేసు రక్తంలో స్వస్థత
నాకై మరణించి తిరిగి లేచె సజీవునిగా ||నా ప్రియుడు||
తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి
నాకై విన్నతి చేయుచున్నాడు (2)
రానైయున్నాడు వేగ – మేఘముపై విభుడే
నన్ను పరమ గృహమునకు తోడ్కొని వెళ్ళును ||నా ప్రియుడు||
Naa Priyudu Yesu Naa Priyudu Yesu
Naa Priyudu Yesu – Naa Priyudu Yesu
Vrelaade Siluvalo Praaname Bali Chesenila (2) ||Naa Priyudu||
Mellani Challani Swarame Vinabadenu (2)
Thandree Veeremi Cheyuchunnaaro (2)
Erugaru Ganuka Kshaminchumanen
Aa Priya Swarame Naa Prabhu Swarame ||Naa Priyudu||
Athani Prema Madhuram Madhuram
Ennatiki Ne Maruvalenu (2)
Dhaarabosenu Jeevam – Naakichche Nithya Jeevam
Shaapamanthaa Baapi Nanu Deevinchenugaa ||Naa Priyudu||
Veepanthaa Dunnabade Naagalitho
Kaare Raktha Varadal Kanumaa (2)
Yesu Rakthamlo Rakshana – Yesu Rakthamlo Swasthatha
Naakai Maraninchi Thirigi Leche Sajeevunigaa ||Naa Priyudu||
Premaye Leka Ne Kumuluchunda
Cherenu Vibhde Naa Cheruvan (2)
Penta Kuppapai Nundi – Levanetthenu Nannu
Kadigi Thanadu Odilo Cherchi Preminchen ||Naa Priyudu||
Thandri Kudi Paarshvamuna Koorchundi
Naakai Vinnathi Cheyuchunnaadu (2)
Raanaiyunnaadu Vega – Meghamupai Vibhude
Nannu Parama Gruhamunaku Thodkoni Vellunu ||Naa Priyudu||
నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును
నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును
శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను (2) ||నేను||
కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున (2)
గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2)
జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు (2)
అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2)
విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు (2)
సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2) ||నేను||
Nenu Velle Maargamu Naa Yesuke Theliyunu
Nenu Velle Maargamu – Naa Yesuke Theliyunu (2)
Shodhinchabadina Meedata – Nenu Suvarnamai Maaredanu (2) ||Nenu||
Kadaleni Kadali Theeramu – Edamaaye Kadaku Naa Brathukuna (2)
Gurileni Tharunaana Veruvaga – Naa Darine Nilicheva Naa Prabhu
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2)
Jalamulalo Badi Ne Vellinaa – Avi Naa Meeda Paaravu (2)
Agnilo Nenu Nadachinaa – Jwaalalu Nanu Kaalchajaalavu
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2)
Vishwaasa Naava Saaguchu – Payaninchu Samayaana Naa Prabhu (2)
Saathaanu Sudigaali Repagaa – Naa Yedute Nilichevaa Naa Prabhu
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2) ||Nenu||

















