

Mahonnathuda
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది
మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట (2) ||మహోన్నతుడా||
మోడుబారిన జీవితాలను
చిగురింప జేయగలవు నీవు (2)
మారా అనుభవం మధురముగా
మార్చగలవు నీవు (2) ||మహోన్నతుడా||
ఆకు వాడక ఆత్మ ఫలములు
ఆనందముతో ఫలియించినా (2)
జీవ జలముల ఊట అయిన
నీ ఓరన నను నాటితివా (2) ||మహోన్నతుడా||
వాడబారని స్వాస్థ్యము నాకై
పరమందు దాచి యుంచితివా (2)
వాగ్ధాన ఫలము అనుభవింప
నీ కృపలో నన్ను పిలచితివా (2) ||మహోన్నతుడా||
Mahonnathudaa Nee Krupalo Nenu Nivasinchuta
Mahonnathudaa
Nee Krupalo Nenu Nivasinchuta
Naa Jeevitha Dhanyathai Yunnadi
Mahonnathudaa
Nee Krupalo Nenu Nivasinchuta (2) ||Mahonnathudaa||
Modubaarina Jeevithaalanu
Chigurimpa Jeyagalavu Neevu (2)
Maaraa Anubhavam Madhuramugaa
Maarchagalavu Neevu (2) ||Mahonnathudaa||
Aaku Vaadaka Aathma Phalamulu
Aanandamutho Phaliyinchanaa (2)
Jeeva Jalamula Oota Ainaa
Nee Orana Nanu Naatithivaa (2) ||Mahonnathudaa||
Vaadabaarani Swaasthyamu Naakai
Paramandu Daachi Yunchithivaa (2)
Vaagdhaana Phalamu Anubhavimpa
Nee Krupalo Nannu Pilachithivaa (2) ||Mahonnathudaa||
నా ప్రాణప్రియుడా నా యేసురాజా
నా ప్రాణప్రియుడా నా యేసురాజా
నా యేలినవాడా నా స్నేహితుడా (2)
నిన్ను చేరాలని నీతో ఉండాలని (2)
నిన్ను వలచానయ్యా – నీవు నా సొంతం (2) ||నా ప్రాణ||
నీ స్వరము నే వింటిని – ప్రాణం సొమ్మసిల్లెనేసయ్యా
నీ ముఖము నే చూచితిని – మనసానందమాయేనా (2)
నీ ప్రేమను రుచి చూచితి
నీ వశమైతిని యేసయ్యా (2) ||నా ప్రాణ||
నీ చేయి నే పట్టుకొని – నీతో నడవాలనుంది యేసయ్యా
నీ భుజమును నేనానుకొని – నీతో బ్రతకాలనుంది యేసయ్యా (2)
నిన్ను హత్తుకొని
నీ ఒడిలోన నిదురించాలని ఉందయ్యా (2) ||నా ప్రాణ||
Naa Praanapriyudaa Naa Yesuraajaa
Naa Praanapriyudaa Naa Yesuraajaa
Naa Yelinavaadaa Naa Snehithudaa (2)
Ninnu Cheraalani Neetho Undaalni (2)
Ninnu Valachaanayyaa – Neevu Naa Sontham (2) ||Naa Praana||
Nee Swaramu Ne Vintini – Praanam Sommasillenesayyaa
Nee Mukhamu Ne Choochithini – Manasaanandamaayenaa (2)
Nee Premanu Ruchi Choochithi
Nee Vashamaithine Yesayyaa (2) ||Naa Praana||
Nee Cheyi Ne Pattukoni – Neetho Nadavaalanundi Yesayyaa
Nee Bhujamunu Nenaanukoni – Neetho Brathakaalanundi Yesayyaa (2)
Ninnu Haththukoni
Nee Odilona Nidurinchaalani Undayyaa (2) ||Naa Praana||
ప్రాణేశ్వర ప్రభు దైవకుమార
ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార
ప్రణుతింతును నిన్నే- ఆశతీర ||ప్రాణేశ్వర||
నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె (2)
నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే (2) ||ప్రాణేశ్వర||
మూలరాయి నీవైయుండగా – అపొస్తలుల పునాది మీద (2)
నిత్య నివాసముగా కట్టబడుటకై – ఆత్మాభిషేకము అనుగ్రహించితివి (2) ||ప్రాణేశ్వర||
పిడుగులు విసిరే మెరుపుల వంటి – శత్రువులు నాకు ఎదురై నిల్చిన (2)
నాకు విరోధముగా రూపించిన ఏ – ఆయుధము వర్ధిల్లలేదు (2) ||ప్రాణేశ్వర||
నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను (2)
జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము (2) ||ప్రాణేశ్వర||
కమనీయమైన నీ దర్శనము – కలనైనను మెలకువనైన (2)
కనబడినా నా ఆశలు తీరవే – కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి (2) ||ప్రాణేశ్వర||
Praaneshwara Prabhu Daiva Kumaara
Praaneshwara – Prabhu Daiva Kumaara
Pranuthinthunu Ninne – Aasha Theera ||Praaneshwara||
Naa Aathmatho Paatalu Paada
Nee Krupale Naaku Hethuvulaaye (2)
Nithya Nibandhana Neetho Chesi
Nee Paada Sannidhi Cheri Yunnaane (2) ||Praaneshwara||
Moolaraayi Neevaiyundagaa
Aposthalula Punaadi Meeda (2)
Nithya Nivaasamugaa Kattabadutakai
Aathmaabhishekamu Anugrahinchithivi (2) ||Praaneshwara||
Pidugulu Visire Merupula Vanti
Shathruvulu Naaku Edurai Nilchina (2)
Naaku Virodhamugaa Roopinchina
Ae Aaayudhamu Vardhillaledu (2) ||Praaneshwara||
Naa Ootalanniyu Nee Yandenani
Vaadyamu Vaayinchi Paadedanu (2)
Jeevitha Kaalamanthaa Ninne Sthuthinchi
Saageda Noothana Yerushalemu (2) ||Praaneshwara||
Kamaneeyamaina Nee Darshanamu
Kalanainanu Melakuvanaina (2)
Kanabadinaa Na Aashalu Theerave
Kanipettuchuntini Kada Boora Dhwaniki (2) ||Praaneshwara||
నీటి వాగుల కొరకు
— Hosanna Ministriesనీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు -1
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది -2
నా ప్రాణమా నా సమస్తమా – ప్రభుని స్తుతియించుమా -1
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా -2
నా ప్రాణమా నా సమస్తమా
పనికిరాని నను నీవు పైకి లేపితివి
క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి -2
నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి -2
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు
నే వెంబడింతు ప్రభు ॥ నా ప్రాణమా ॥
అంధకారపు లోయలలో నేను నడచితిని
ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి -2
కంటి పాపగ నీవు నన్ను కాచితివి -2
కన్నతండ్రివి నీవని నిన్ను కొలచెదను
ఇలలో నిన్ను కొలచెదను ॥ నా ప్రాణమా ॥
నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు
ఆత్మా ఫలములు దండిగా నీకై ఫలియింతును -2
నీవు చేసిన మేళ్లను నేనెట్లు మరతు ప్రభు -2
నీ కొరకు నే సాక్షిగ ఇలలో జీవింతును
నే ఇలలో జీవింతును ॥ నా ప్రాణమా ॥
Neeti Vagula Koraku duppi
— Hosanna Ministriesయేసు రాజు రాజుల రాజై
— Hosanna Ministriesయేసు రాజు రాజుల రాజై
త్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండె
హోసన్నా జయమే – హోసన్నా జయమే
హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే ॥యేసు॥
యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2)
భయము లేదు జయము మనదే (2)
విజయ గీతము పాడెదము (2) ॥హోసన్నా॥
శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధియైనా (2)
యేసు గాయముల్ స్వస్థపరచున్ (2)
రక్తమే రక్షణ నిచ్చున్ (2) ॥హోసన్నా॥
హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ (2)
యేసు రాజు మనకు ప్రభువై (2)
త్వరగా వచ్చుచుండె (2) ॥హోసన్నా॥
Yesu Raju Rajula Rajai Thvaraga
— Hosanna Ministriesశాశ్వత కృపను నేను తలంచగా
— Hosanna Ministriesశాశ్వత కృపను నేను తలంచగా
కానుకనైతిని నీ సన్నిధిలో – కానుకనైతిని నీ సన్నిధిలో
శాశ్వత కృపను నేను తలంచగా
నా హృదయమెంతో – జీవము గల దేవుని
దర్శించ ఆనందముతో కేకలేయుచున్నది -2
నా దేహమెంతో నీకై ఆశించే -2 ॥ శాశ్వత ॥
భక్తిహీనులతో – నివసించుట కంటెను
నీ మందిరావరాణములో ఒక్కదినము గడుపుట -2
వేయిదినాల కంటే శ్రేష్ఠమైనది -2 ॥ శాశ్వత ॥
సీయోను శిఖరాన – సిలువ సితారతో
సింహాసనం ఎదుట క్రొత్తపాట పాడెద -2
సీయోను రారాజువు నీవెగా -2 ॥ శాశ్వత ॥
Saashwatha Krupanu
— Hosanna Ministriesఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి
— Hosanna Ministriesఓ ప్రభువా… ఓ ప్రభువా…
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి (2)
నిత్య జీవము నిచ్చిన దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లపుడు చేయి విడువక (2)
అంతము వరకు కాపాడు దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)
నన్ను నీవు మరువని దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
O Prabhuva O Prabhuvaa Neeve na
— Hosanna MinistriesO Prabhuvaa… O Prabhuvaa…
Neeve Naa Manchi Kaaparivi (4) ||O Prabhuvaa||
Daari Thappina Nannunu Neevu
Vedaki Vachchi Rakshinchithivi (2)
Nithya Jeevamu Nichchina Devaa (2)
Neeve Naa Manchi Kaaparivi (4) ||O Prabhuvaa||
Neevu Preminchina Gorrelannitini
Ellappudu Cheyi Viduvaka (2)
Anthamu Varaku Kaapaadu Devaa (2)
Neeve Naa Manchi Kaaparivi (4) ||O Prabhuvaa||
Pradhaana Kaaparigaa Neevu Naakai
Prathyakshamagu Aa Ghadiyalalo (2)
Nannu Neevu Maruvani Devaa (2)
Neeve Naa Manchi Kaaparivi (4) ||O Prabhuvaa||
నా జీవం నీ కృపలో దాచితివే
— Hosanna Ministriesనా జీవం నీ కృపలో దాచితివే
నా జీవిత కాలమంతా
ప్రభువా నీవే నా ఆశ్రయం
నా ఆశ్రయం ||నా జీవం||
పాపపు ఊబిలో పడి కృంగిన నాకు
నిత్య జీవమిచ్చితివే (2)
పావురము వలె నీ సన్నిధిలో
జీవింప పిలచితివే (2) ||నా జీవం||
ఐగుప్తు విడచినా ఎర్ర సముద్రము
అడ్డురానే వచ్చెనే (2)
నీ బాహు బలమే నన్ను దాటించి
శత్రువునే కూల్చెనే (2) ||నా జీవం||
కానాను యాత్రలో యొర్దాను అలలచే
కలత చెందితినే (2)
కాపరివైన నీవు దహించు అగ్నిగా
నా ముందు నడచితివే (2) ||నా జీవం||
వాగ్ధాన భూమిలో మృత సముద్రపు భయము
నన్ను వెంటాడెనే (2)
వాక్యమైయున్న నీ సహవాసము
ధైర్యము పుట్టించెనే (2) ||నా జీవం||
స్తుతుల మధ్యలో నివసించువాడా
స్తుతికి పాత్రుడా (2)
స్తుతి యాగముగా నీ సేవలో
ప్రాణార్పణ చేతునే (2) ||నా జీవం||
Naa Jeevam Nee Krupalo Daachithive
— Hosanna MinistriesNaa Jeevam Nee Krupalo Daachithive
Naa Jeevitha Kaalamanthaa
Prabhuvaa Neeve Naa Aashrayam
Naa Aashrayam ||Naa Jeevam||
Paapapu Oobhilo Padi Krungina Naaku
Nithya Jeevamichchithive (2)
Paavuramu Vale Nee Sannidhilo
Jeevimpa Pilachithive (2) ||Naa Jeevam||
Aigupthu Vidachinaa Erra Samudramu
Adduraane Vachchene (2)
Nee Baahu Balame Nannu Daatinchi
Shathruvune Koolchene (2) ||Naa Jeevam||
Kaanaanu Yaathralo Yordaanu Alalache
Kalatha Chendithine (2)
Kaaparivaina Neevu Dahinchu Agnigaa
Naa Mundu Nadachithive (2) ||Naa Jeevam||
Vaagdhaana Bhoomilo Mrutha Samudrapu Bhayamu
Nannu Ventaadene (2)
Vaakyamaiyunna Nee Sahavaasamu
Dhairyamu Puttinchene (2) ||Naa Jeevam||
Sthuthula Madhyalo Nivasinchuvaadaa
Sthuthiki Paathrudaa (2)
Sthuthi Yaagamugaa Nee Sevalo
Praanaarpana Chethune (2) ||Naa Jeevam||