

Nithya Thejuda Yesayya
ప్రేమపూర్ణుడా స్నేహశీలుడా
— Hosanna Ministriesప్రేమపూర్ణుడా – స్నేహశీలుడా
విశ్వనాధుడా- విజయవీరుడా
ఆపత్కాలమందున – సర్వలోకమందున్న
దీనజనాళి దీపముగా – వెలుగుచున్నవాడా
ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా
ఆనందింతు నీలో-జీవితాంతము
నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య ||ప్రేమపూర్ణుడా ||
1. పూర్ణమై – సంపూర్ణమైన – నీదివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము ||2||
ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు
ఇన్నాళ్లు క్షణమైనా నను మరువని యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా ||2|| ||ప్రేమపూర్ణుడా ||
2. భాగ్యమే – సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి ||2||
బలమైన – ఘనమైన నీనామమందు హర్షించి
భజియించి – కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా ||2|| ||ప్రేమపూర్ణుడా ||
3. నిత్యము – ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో
నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే ||2||
నిర్మలమైన నీ మనసే – నా అంకితం చేసావు
నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా ||2|| ||ప్రేమపూర్ణుడా ||
Premapurnuda Snehasheeluda
— Hosanna MinistriesPremapoornuda – Snehaseeluda
Viswanaadhudaa – Viajayaveeruda
Aapatkaalamanduna – Sarvalokamandunna
Deenajanaali deepamugaa – Veluguchunnavaada
Aaraadhintu ninne – lokarakshakuda
Aanandintu nel – Jeevitaantamu
Neekrupa yenta vunnatamo varninchalenu swaami
Nee krupayandu tudivaraku – nadipinchu Yesayya //Prema//
1. (poornamai -sampoornamaina – Nee divya chittame
Neenu nanu Nadine nootanamaina jeevamaargamu) //2//
Ihamandu paramandu asrayamainavaadavu
Innallu kshanamaina nanu maruvani Yesayya
Chorus:
(Naa todu nevunte ante chaalayya…
naamundu neevunte bhayame ledayya..) //2//Prema//
2.(Bhaagyame – soubhaagyame nee divyasannidhi
bah vustaaramaina nee krupa naapai choopitivi) //2//
Balamaina – ghanamaina nee naamamandu harshinchi
Bhajiyinchi – keertinchi ghanaparatu ninnu Yesayya
Chorus:
(Naa todu nevunte ante chaalayya…
naamundu neevunte bhayame ledayya..) //2//Prema//
3.(Nityamu – pratinityamu nee jnaapakaalato
Naa antarangamandu neevu – koluvai vunnaavule) //2//
Nirmalamaina nee manase – Na ankitam chesaavu
Neetone jeevimpa nannu konipo Yesayya
Chorus:
(Naa todu nevunte ante chaalayya…
Naamundu neevunte bhayame ledayya..) //2//Prema//
శ్రావ్య సదనము
— Hosanna Ministriesనీవే శ్రావ్యసదనము
నీదే శాంతి వదనము
నీ దివి సంపద నన్నే చేరగా
నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా
నా ప్రతి స్పందనే ఈ ఆరాధన
నా హృదయార్పణ నీకే యేసయ్యా
” నీవే ”
1.విరజిమ్మే నాపై కృప కిరణం
విరబుసే పరిమళమై కృప కమలం “2”
విశ్వాసయాత్రలో ఒంటరినై
విజయ శిఖరము చేరుటకు
నీ దక్షిణ హస్తం చాపితివి
నన్నాదుకొనుటకు వచ్చితివి
నను బలపరచి నడిపించే
నా యేసయ్యా
“నీవే ”
2. నీ నీతి నీ రాజ్యం వెదకితిని
నిండైన సౌభాగ్యం పొందుటకు “2”
నలిగి విరిగిన హృదయముతో
నీ వాక్యమును సన్మానించితిని
శ్రేయస్కరమైన దీవెనతో
శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు
నను ప్రేమించి పిలచితివి
నా యేసయ్యా
“నీవే ”
3. పరిశూద్దాత్మకు నిలయముగా
ఉపదేశమునకు వినయముగా “2”
మహిమ సింహాసనము చేరుటకు
వధువు సంఘముగా మార్చుమయా
నా పితరులకు ఆశ్రయమై
కోరిన రేవుకు చేర్పించి
నీ వాగ్దానం నెరవేర్చితివి
నా యేసయ్యా
“నీవే “
Sravya Sadanamu
— Hosanna Ministriesకరుణాసాగర
— Hosanna Ministriesకరుణాసాగర యేసయ్యా
కనుపాపగ నను కాచితివి
ఉన్నతమైన ప్రేమతో
మనసున మహిమగా
నిలిచితివి
మరణపులోయలో దిగులు చెందగా
అభయము నొందితి నినుచూచి
దాహముతీర్చిన జీవనది
జీవమార్గము చూపితివి
యోగ్యతలేని పాత్రనునేను
శాశ్వతప్రేమతో నింపితివి
ఒదిగితిని నీ కౌగిలిలో
ఓదార్చితివి వాక్యముతో
అక్షయస్వాస్థ్యము నే పొందుటకు
సర్వసత్యములో నడిపితివి
సంపూర్ణపరచి జ్యేష్ఠులతో
ప్రేమనగరిలో చేర్చుమయ్యా
Karunaasaagara
— Hosanna Ministriesఅనురాగపూర్ణుడా
— Hosanna Ministriesపల్లవి: నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకా
మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా)
1. సంతోష గానాల స్తోత్రసంపద
నీకే చెల్లింతును ఎల్లవేళల
అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా”2″
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవులేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా”2″ (నీకేగా)
2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ
వేరే జగమందు నే ఎందు వెతికినను
నీతిభాస్కరుడా నీ నీతికిరణం
ఈ లోకమంతా ఏలుచున్నదిగా”2″
నా మదిలోన మహారాజు నీవేనయ్య
ఇహపరమందు నన్నేలు తేజోమయ
నీ నామం కీర్తించి ఆరాధింతును”2″ (నీకేగా)
3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకేగా అంకితం”2″
నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా
నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా
నీ కొరకే నేనిలలో జీవింతును”2″ (నీకేగా)
Anuragapurnuda
— Hosanna Ministriesసిలువలో వ్రేలాడే
సిలువలో వ్రేలాడే నీ కొరకే
సిలువలో వ్రేలాడే…
యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము…
యేసు నిన్ను పిలచుచుండే…
1.కల్వరి శ్రమలన్ని నీ కొరకే
ఘోర సిలువ మోసి కృంగుచునే “2”
గాయములచే బాధనొంది
రక్తము కార్చి హింసనొంది “2” “సిలువలో”
2.నాలుక యెండెను దప్పి గొని
కేకలు వేసెను దాహమని “2”
చేదురసమును పానము చేసి చేసెను జీవయాగమును “2” “సిలువలో”
3.అగాధ సముద్ర జలములైనా
ఈ ప్రేమను ఆర్పజాలవుగా “2”
ఈ ప్రేమ నీకై విలపించుచూ
ప్రాణము ధార బోయుచునే “2” “సిలువలో”
Siluvalo Vrelade
జీవన మకరందం
— Hosanna Ministriesపరిమళ తైలం నీవే
తరగని సంతోషం నీలో
జీవన మకరందం నీవే
తియ్యని సంగీతం నీవే
తరతరాలలో నీవే
నిత్య సంకల్ప సారథి నీవే
జగముల నేలే రాజా
నా ప్రేమకు హేతువు నీవే
చరణం:-1
ఉరుముతున్న మెరుపులవంటి
తరుముచున్న శోధనలో
నేనున్నా నీతో అంటూ
నీవే నాతో నిలిచినావు
క్షణమైనా విడువక ఔదార్యం
నాపై చుపినావు
నీ మనసే అతి మధురం
అది నా సొంతమే ||పరిమళ||
చరణం:-2
చిల్చ బడిన బందనుండి
కొదువ చీల్చి నదిలితివి
నిలువరమగు ఆత్మ శక్తితో
కొరత లేని ఫలములతో
నను నీ రాజ్యమునకు పాత్రుని
చేయ ఏర్పరచు కుంటివే
నీ స్వాస్త్యములోనే చేరుటకై
అభిషేకించినావు
నీ మహిమార్థం వాడబడే
పాత్రను నేను ||పరిమళ||
చరణం:-3
వెచియిన్న కనులకు
నీవు కనువిందే చేస్తావని
సిద్ధపడిన రాజుగా నీవు
నాకోసం వాస్తవనీ
నిను చూసిన వేల నాలో ప్రాణం ఉద్వేగ బరితమై
నీ కౌగిట వొదిగి ఆనందంతో
నీలో మమేకమై
యుగ యుగయుగములలో నీతో
నేను నిలిచి పొదును ||పరిమళ||
Jeevana Makarandham
— Hosanna Ministriesనూతనమైన కృప
— Hosanna Ministriesనూతనమైన కృప – నవ నూతనమైన కృప
శాశ్వతమైన కృప – బహు ఉన్నతమైన కృప
నిరంతరం నాపై చూపిన – నిత్యతేజుడా యేసయ్యా
నీవాత్సల్యమే నాపై చూపించిన నీప్రేమను వివరించనా!
నను నీకోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా….
ఇదేకదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం
నాక్రయధనముకై రుధిరము కాంతివి
ఫలవంతములైన తోటగా మార్చితివి
ఫలితముకొరకైన శోధన కలిగినను
ప్రతిఫలముగ నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి
అన్నివేళలయందు ఆశ్రయమైనావు
ఎంతగా కీర్తించినా – నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం – మరువలేని తియ్యని జ్ఞాపకం
నీ వశమైయున్న ప్రాణాత్మదేహమును
పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను
పలువేదనలలో నీతో నడిపించి
తలవంచని తెగువ నీలో కలిగించి
మదిలో నిలిచావు – మమతను పంచావు
నా జీవితమంతా నిను కొనియాడెదను
ఎంతగా కీర్తించినా – నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం – మరువలేని తియ్యని జ్ఞాపకం
సాక్షి సమూహము మేఘమువలెనుండి
నాలో కోరిన ఆశలు నెరవేరగా
వేలాది దూతల ఆనందముచూచి
కృపమహిమైశ్వర్యం నే పొందిన వేళ
మహిమలో నీతోనే నిలిచిన వేళ
మాధుర్య లోకాన నిను చూచిన వేళ
ఎంతగా కీర్తించినా – నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం – మరువలేని తియ్యని జ్ఞాపకం
Nuthanamaina Krupa
— Hosanna Ministriesఆకాశం వైపు నా కన్నులెత్తి చున్నాను
— Hosanna Ministriesఆకాశం వైపు నా కన్నులెత్తి చున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా”2″
కలవరము నోoదును నిన్ను నమ్మి ఉన్నాను”2″
కలత నేను చెందను కన్నీళ్లు విడువను”2″
” ఆకాశం వైపు “
1. ఆకాశం పై నీ సింహాసనమున్నది రాజదండంతో నన్నేలుచున్నది”2″
నీతిమంతునిగా చేసి నిత్యజీవం అనుగ్రహించి- నీతిమంతునిగా చేసి నిత్యజీవం అనుగ్రహించితివి
నేనేమైయున్నానో అది నీ కృప ఏ కదా”2″
” ఆకాశం వైపు “
2. ఆకాశం నుండి నాతో మాట్లాడుచున్నావు ఆలోచన చేత నన్ను నడిపించు చున్నావు”2″
నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చి- నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చితివి
నీవుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదయ్యా”2″
” ఆకాశం వైపు “
3. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఉన్నది అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది”2″
నా హృదయమే నీ మందిరమై తేజస్సుతో నింపి- నా హృదయమే నీ మందిరమై తేజస్సుతో నింపితివి
కృపాసనముగా నన్ను మార్చి నాలో నిరంతరం నివసించితివి”2″
” ఆకాశం వైపు “
4. ఆకాశం నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షం నీ చేతి పనులు ప్రచురించుచున్నది”2″
భాష లేని మాటలేని స్వరమే వినబడని- భాష లేని మాటలేని స్వరమే వినబడనివి
పగులు బోధించుచున్నది రాత్రి జ్ఞానమిచ్చుచున్నది”2″
” ఆకాశం వైపు “
5. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము నాకై నిర్మించుచున్నావు”2″
మేఘ రథములపై అరుదించి నన్ను కొనిపోవా”2″
ఆశతో వేచియుంటిని త్వరగా దిగి రమ్మయ్య “2”
” ఆకాశం వైపు “”2”
కలవరము నోoదును…”2″
కలవరము”2″
కలవరము..నోoదును…
“కలవరము నోoదును””2″
” కలత నేను చెందను””2″
ఆకాశం వైపు నా కన్నులెత్తి చున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా”2″
సహాయకుడవు నీవే యేసయ్యా..
















