

Vaschalyapurnuda
పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు
— Hosanna Ministriesపరిశుద్ధుడవై – మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు
బలవంతుడవై – దీనుల పక్షమై కృప చూపు వాడవు (2)
దయాళుడవై – ధారాళముగా నను దీవించిన శ్రీమంతుడా
ఆరాధన నీకే నా యేసయ్యా
స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడవై||
నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిను సేవించుటకు
నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి (2)
శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి
నీ దాసుల ప్రార్ధనలు సఫలము చేసితివి ||ఆరాధన||
నీ నిత్యమైన ఆదరణ చూపి నను స్థిరపరచుటకు
నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి (2)
నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి
నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి ||ఆరాధన||
ఆనందకరమైన దేశములో నేను నిను ఘనపరచుటకు
నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి (2)
మేఘ వాహనుడవై వచ్చుఁవరకు నే కనిపెట్టుచుందును నీ కోసము
నీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచెదవు ||ఆరాధన||
Parishuddhudavai Mahima
— Hosanna MinistriesParishuddhudavai – Mahima Prabhaavamulaku Neeve Paathrudavu
Balavanthudavai – Deenula Pakshamai Krupa Choopu Vaadavu (2)
Dayaaludavai – Dhaaraalamugaa Nanu Deevinchina Shreemanthudaa
Aaraadhana Neeke Naa Yesayyaa
Sthuthi Aaraadhana Neeke Naa Yesayyaa (2) ||Parishuddhudavai||
Nee Swaasthyamaina Nee Vaaritho Kalisi Ninu Sevinchutaku
Nee Mahima Prabhaavamunu Kireetamugaa Dharimpajesithivi (2)
Shaashwatha Kaalamu Varaku Nee Santhathipai Drushti Nilipi
Nee Daasula Praardhanalu Saphalamu Chesithivi ||Aaraadhana||
Nee Nithyamaina Aadarana Choopi Nanu Sthiraparachutaku
Nee Karunaa Kataakshamunu Naapai Kuripinchi Nanu Preminchithivi (2)
Naaku Prayojanamu Kalugajeyutaku Nee Upadeshamunu Bodhinchi
Nee Daasuni Praanamunu Santhoshaparachithivi ||Aaraadhana||
Aanandakaramaina Deshamulo Nenu Ninu Ghanaparachutaku
Nee Mahimaathmatho Nimpi Surakshithamuga Nannu Nivasimpajesithivi (2)
Megha Vaahanudavai Vachchuvaraku Ne Kanipettuchundunu Nee Kosamu
Nee Daasula Kaankshanu Sampoorna Parachedavu ||Aaraadhana||
ప్రేమాంబుధి కృపానిధి నడిపించుసారధి
— Hosanna Ministriesప్రేమాంబుధి కృపానిధి నడిపించుసారధి
నీ ప్రేమయే నా ధ్యానము
నీ స్నేహమే నా ప్రాణము
నీవే నా గానమూ
ఎదుట నిలిచి నీవు ఉంటే భయములేదిక
ఎండమావి నీరు చూసి మోసపోనిక
సాగిపోయే నీడచూచి – కలత చెందక
నీకై జీవించెద | ప్రేమా॥
సంద్రమందు అలలపిలె అలసిపోనిక
ధరణిలోని ధనము చూసి ఆశచెందక
భారమైన జీవితాన్ని సెదదీర్దిన
నీ ప్రేమ పొందెద || ప్రేమా॥
Premambudhi Krupaanidhi
— Hosanna Ministriesసన్నుతించెదను దయాళుడవు నీవని
— Hosanna Ministriesసన్నుతించెదను దయాళుడవు నీవని
యెహోవా నీవే దయాళుడవని
నిను సన్నుతించెదను
సర్వసత్యములో నను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా
కృపాధారము నీవేగా షాలేము రాజా
నిను సన్మానించెదను
నీ కనుచూపుల పరిధిలో నన్ను నిలిపి
చూపితివా నీ వాత్సల్యమును
కృపనిదివి నీవెగా నా యేసురాజా
నిను సన్మానించెధను
ఇహపరమందున నీకు సాటిలేరయా
ప్రగతిని కలిగించు రాజువు నీవయా
యూదా గోత్రపు సింహమా రాజాధి రాజా
నిను సన్మానించెధను.
Sannuthinchedhanu Dayaludavu
— Hosanna Ministriesనిజమైన ద్రాక్షావల్లి నీవే
— Hosanna Ministriesనిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలోనే (2)
శాశ్వతమైనది ఎంతో మధురమైనది
నాపైన నీకున్న ప్రేమ
ఎనలేని నీ ప్రేమ – (2) ||నిజమైన||
అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో
జీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా (2)
శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి
నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా (2) ||నిజమైన||
నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో
అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా (2)
వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు
జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా (2) ||నిజమైన||
షాలేము రాజా రమ్యమైన సీయోనుకే
నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో (2)
అలసి పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి
ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో (2) ||నిజమైన||
Nijamaina Draakshaavalli Neevee
— Hosanna MinistriesNijamaina Draakshaavalli Neevee
Nithyamaina Santhoshamu Neelone (2)
Shaashwathamainadhi Entho Madhuramainadhi
Naapaina Neekunna Prema
Enaleni Nee Prema – (2) ||Nijamaina||
Athi Kaankshaneeyudaa Divyamaina Nee Roopulo
Jeevinchuchunnaanu Nee Premaku Ne Pathrikagaa (2)
Shithilamaiyundagaa Nannu Needhu Rakthamutho Kadigi
Nee Polikagaa Maarchinaave Naa Yesayyaa (2) ||Nijamaina||
Naa Praanapriyudaa Sreshtamaina Phalamulatho
Arpinchuchunnaanu Sarvamu Neeke Arpanagaa (2)
Vaadiponivvaka Naaku Aashrayamaithivi Neevu
Jeevapu Ootavai Balaparachithivi Naa Yesayyaa (2) ||Nijamaina||
Shaalemu Raajaa Ramyamaina Seeyonuke
Nanu Nadipinchumu Nee Chitthamaina Maargamulo (2)
Alasi Ponivvaka Nannu Needhu Aathmatho Nimpi
Aadharanakarthavai Nanu Cherchumu Nee Raajyamulo (2) ||Nijamaina||
నీతో నా జీవితం సంతోషమే
— Hosanna Ministriesనీతో నా జీవితం సంతోషమే
నీతో నా అనుబంధం మాధుర్యమే (2)
నా యేసయ్యా కృప చూపుచున్నావు – వాత్సల్యపూర్ణుడవై
నా యేసయ్యా నడిపించుచున్నావు – స్ఫూర్తిప్రదాతవై
ఆరాధ్యుడా యేసయ్యా…
నీతో నా అనుబంధం మాధుర్యమే
భీకర ధ్వనిగలా మార్గమునందు
నను స్నేహించిన నా ప్రియుడవు నీవు (2)
కలనైన మరువను నీవు నడిపిన మార్గం
క్షణమైన విడువను నీతో సహవాసం (2) ||ఆరాధ్యుడా||
సంతోషమందైనా శ్రమలయందైనను
నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే (2)
నిత్యమైన మహిమలో నను నిలుపుటకు
శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు (2) ||ఆరాధ్యుడా||
ఆకాశమందుండి ఆశీర్వదించితివి
అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని (2)
నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు
నూతన కృపలతో నను నింపుచున్నావు (2) ||నీతో నా||
Neetho Naa Jeevitham Santhoshame
— Hosanna MinistriesNeetho Naa Jeevitham Santhoshame
Neetho Naa Anubandham Maadhuryame (2)
Naa Yesayyaa Krupa Choopuchunnaavu – Vaathsalyapoornudavai
Naa Yesayyaa Nadipinchuchunnaavu – Spoorthipradhaathavai
Aaraadhyudaa Yesayyaa…
Neetho Naa Anubandham Maadhuryame
Bheekara Dhwanigala Maargamunandu
Nanu Snehinchina Naa Priyudavu Neevu (2)
Kalanaina Maruvanu Neevu Nadipina Maargam
Kshanamaina Viduvanu Neetho Sahavaasam (2) ||Aaraadhyudaa||
Santhoshamandainaa Shramalayandainanu
Naa Sthuthi Keerthanaku Aadhaaramu Neeve (2)
Nithyamaina Mahimalo Nanu Niluputaku
Shuddha Suvarnamugaa Nanu Maarchuchunnaavu (2) ||Aaraadhyudaa||
Aakaashamandundi Aasheervadinchithivi
Abhaagyudanaina Nenu Kanikarimpabadithini (2)
Neelo Niluchutaku Bahugaa Phalinchutaku
Noothana Krupalatho Nanu Nimpuchunnaavu (2) ||Neetho Naa||
విలువైనది సమయము ఓ నేస్తమా
— Hosanna Ministriesవిలువైనది సమయము ఓ నేస్తమా
ఘనమైనది జీవితం ఓ ప్రియతమా (2)
సమయము పోనివ్వక సద్భక్తితో
సంపూర్ణతకై సాగెదము (2) ||విలువైనది||
క్రీస్తుతో మనము లెపబడిన వారమై
పైనున్నవాటినే వెదకిన యెడల (2)
గొర్రెపిల్లతొ కలిసి
సీయోను శిఖరముపై నిలిచెదము (2) ||విలువైనది||
శోధన మనము సహించిన వారమై
క్రీస్తుతొ మనము శ్రమించిన యెడల (2)
సర్వాధికారియైన
ప్రభువుతో కలిసి ఏలెదము (2) ||విలువైనది||
క్రీస్తుతో మనము సింహాసనముపై
పాలించుటకై జయమొందుటకు (2)
సమర్పణ కలిగి
పరిశుద్దతలో నిలిచెదము (2) ||విలువైనది||
Viluvainadhi Samayamu O Nesthamaa
— Hosanna MinistriesViluvainadhi Samayamu O Nesthamaa
Ghanamainadhi Jeevitham O Priyathamaa (2)
Samayamu Ponivvaka Sadhbhakthitho
Sampoornathakai Saagedhamu (2) ||Viluvainadhi||
Kreesthutho Manamu Lepabadinavaaramai
Painunna Vaatine Vedakina Yedala (2)
Gorrepillatho Kalisi
Seeyonu Shikharamupai Nilichedhamu (2) ||Viluvainadhi||
Shodhana Manamu Sahinchina Vaaramai
Kreesthutho Manamu Shraminchina Yedala (2)
Sarvaadhikaariyaina
Prabhuvutho Kalisi Aeledhamu (2) ||Viluvainadhi||
Kreesthutho Manamu Simhaasanamupai
Paalinchutakai Jayamondhutaku (2)
Samarpana Kaligi
Parishuddhathalo Nilichedhamu (2) ||Viluvainadhi||
గొప్పదేవుడా మహోన్నతుడా
— Hosanna Ministriesగొప్పదేవుడా – మహోన్నతుడా
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
ఆనందింతును సేవింతును
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
నా దీనదశలో నన్నాదుకొని
నీ ఆశ్రయపురములో చేర్చుకొని
నీ సన్నిధిలో నివసింపజేసితివి
నీ ప్రభావమహిమాలకే నీ సాక్షిగా నిలిపితివి ॥|గొప్ప॥
వివేకముతో జీవించుటకు
విజయముతో నిను స్తుతించుటకు
నీ రక్షణతో అలంకరించితివి
నీ ఆనందతైలముతో నన్నభిషేకించితువి ॥ గొప్ప
సర్వసత్యములో నే నడుచుకొని
విత్య సీయోనులో నేనిలుచుటకు
జీవపు వెలుగులో నడుపించుచున్నావు
నీ సంపూర్ణత నాలో కలిగించుచున్నావు ॥|గొప్ప॥















